వినోదం

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించిన ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోలకు విలన్ గా నటిస్తూ వరుస ఆఫర్లు అనుకుంటున్నారు. క్షేత్రం సినిమా తరువాత హీరో పాత్రలకు పులిస్టాప్ పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ సినిమాతో పవర్ఫుల్ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

ప్రస్తుతం జగపతిబాబు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం స‌లార్ 2 లో పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే ఆయన ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడుతారు. తన లైఫ్ లోని ఎత్తుపల్లాల గురించి కూడా ఓపెన్ గా చెప్పేస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన కూతుర్ల పెళ్లిళ్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన పెద్ద కూతురు ఓ అమెరికన్ ని ప్రేమిస్తే మరో మాట ఆడకుండా దగ్గరుండి పెళ్లి చేశారట. పెద్ద కుమార్తె పిల్లల్ని వద్దు అనుకుంటున్నాను అని చెబితే ఆమె నిర్ణయాన్ని స్వాగతించినట్టు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

jagapathi babu told these interesting facts about his daughters

ఆమె ఇప్పుడు పెట్స్ పెంచుకుంటుందని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇక చిన్న కూతురికి అయితే తాను పెళ్లి చేయనని చెప్పేసారట జగ్గు భాయ్. ఎందుకంటే పిల్లలకు త్వరగా పెళ్లి చేయడం అనేది చేతులు దులిపేసుకునే స్వార్ధమని చెప్పుకొచ్చారు. పెళ్లి అనేది ఎవరికి వారు తీసుకోవలసిన నిర్ణయం అన్నారు. పిల్లలతో ఫ్రెండ్స్ లా ఉండాలని చెప్పిన ఆయన.. పెద్దయ్యాక వాళ్ళు ఎలా బతకాలన్నది వాళ్లకే వదిలేయాలని అన్నారు. ఇక ఇద్దరు కుమార్తెలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు తాత అవ్వలేరు కదా అంటే.. అయితే అవ్వకపోతే ఎంత తొక్క.. అని సిల్లీగా కొట్టి పడేశారు. ఏదైనా బాబులో ఈ లెవెల్ మెచ్యూరిటీ చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది.

Admin

Recent Posts