సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాను రాజమౌళితో చేస్తున్న విషయం విదితమే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక అధికారిక అప్‌డేట్ కూడా రాలేదు. కేవలం షూటింగ్‌ను మాత్రమే ప్రారంభించారు. ప్రస్తుతం 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా మహేష్ తన నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు గాను మహేష్ చాలా రిస్క్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీలో మహేష్ యాక్షన్ సీన్లు అన్నింటినీ డూప్ లేకుండానే చేస్తున్నారట. సాధారణంగా భారీ యాక్షన్ సీన్లు ఉంటే హీరోలు రిస్క్ తీసుకోరు. డూప్‌లతో పని కానిచ్చేస్తారు. కానీ రాజమౌళి పట్టుబట్టి మరీ మహేష్‌తో యాక్షన్ సీన్లను చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మహేష్ కూడా అడ్డు చెప్పడం లేదని, డూప్ లేకుండా చేస్తేనే రియల్‌గా ఉంటుందనే ఫీలింగ్ వస్తుందని చెప్పి మహేష్ ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే చాలా వరకు యాక్షన్ సీన్లను డూప్ లేకుండానే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఇందుకు గాను చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని, మహేష్ ఆరోగ్యం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
ఆఫ్రికా అడ్వెంచర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సోలోగా ఓ పాటకు అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందుకు గాను హైదరాబాద్ లో సెట్ కూడా వేశారని ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేష్‌తోపాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా డ్యాన్స్ చేస్తుందని సమాచారం. ఇక ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సందర్బంగా ఈ మూవీకి చెందిన ఏదైనా అప్‌డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఫ్యాన్స్ వేచి చూడక తప్పదు.