వినోదం

పూరి జగన్నాథ్.. సినిమాల్లో హీరోలకు ఉన్న కామన్‌ పాయింట్‌ ఇదే

పూరి జగన్నాథ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పూరి జగన్నాథ్. మొదట ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీల వద్ద శిష్యరికం చేసిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం గురువులను మించిన శిష్యుడు అనిపించుకున్నాడు పూరీ జగన్నాథ్. పూరి జగన్నాథ్ దర్శకునిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సినిమా బద్రి అన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లు గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా మంచి హిట్‌ అయింది. అయితే, పూరి జగన్నాథ్.. సినిమాల్లో… హీరోలకు ఒకే కామన్‌ పాయింట్‌ ఉంటుంది.

puri jagannadh movies will have this common point

కచ్చితంగా పూరి సినిమాల్లో హీరోలకు ఇల్లు ఉండదు. రోడ్డు సైడ్‌ రోమియోల లాగా ఉంటారు హీరోలు. అలాగే, ఒక కుటుంబం అంటూ ఉండదు. నా అనుకునే వాళ్లు పూరి హీరోలకు ఉండరు. అలా వచ్చిన సినిమా చాలానే ఉన్నాయి. పూరి దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ కు నా అనే వాళ్లు ఉండరు. అటు పోకిరి సినిమాలో కూడా రోడ్‌ సైడ్‌ రొమియోలాగా మహేష్‌ ఉంటాడు. హార్ట్‌ ఎటాక్‌ సినిమా లో నితిన్‌ కు కూడా ఒక కుటుంబం ఉండదు. అలాగే, ఇస్మార్ట్‌ శంకర్‌ లోనూ రామ్‌ కు ఒక కుటుంబం ఉండదు. ఇలా అన్ని సినిమాల్లోనూ ఇలాగే ఉంటుంది.

Admin

Recent Posts