వినోదం

రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!

రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో మ‌గ‌ధీర కూడా ఒక‌టి. మొదట ఈ సినిమాలో హీరోగా అనుకున్నది టాలీవుడ్ స్టైల్ హీరో అల్లు అర్జున్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పైన తెరకెక్కింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి హీరో ఈ సినిమాలో నటిస్తే సూపర్ అంటూ అప్పట్లో అల్లు అరవింద్ భావించారట. అయితే రాజమౌళి కథకు బన్నీ సూట్ అవ్వడని సున్నితంగా ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట. అయితే మెగా పవర్ స్టార్ చరణ్ ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.

స్వయంగా చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో అప్ప‌ట్లో ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో ఒక ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా గేమ్ ఆడుతూనే మరోవైపు చరణ్, ఎన్టీఆర్ తో అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మగధీర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను షేర్ చేశాడు చరణ్.

ram charan said his horse kajal created problems for him

తన వద్ద గుర్రాలు ఉన్నాయని, అందులో ఒక దాని పేరు బాద్షా, మరొక దాని పేరు కాజల్ అని తెలిపాడు. అయితే మగధీర సినిమా టైములో గుర్రాలు అవసరం కావడం వల్ల కాజల్ ను ఉపయోగించాము. కానీ సినిమాలో హీరోయిన్ కూడా కాజలే కావడం, తన గుర్రం పేరు కూడా కాజల్ కావడంతో చాలా ఇబ్బంది అయిందని, ముఖ్యంగా దాన్ని పిలిచే విషయంలో మరింత ఇబ్బంది పడ్డామని తెలిపారు రామ్ చరణ్. మొత్తానికి కాజల్ చరణ్ ను అలా ఇబ్బంది పెట్టిందన్నమాట.

Admin

Recent Posts