వినోదం

కట్టప్ప కూతురిని చూసారా ? అందంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువేమి కాదు !

నటుడు సత్యరాజ్ అంటే వెంటనే చాలామంది కట్టప్ప కదా అని సమాధానం చెబుతారు. ఈ తమిళ నటుడు బహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పోషించాక ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కోలీవుడ్ లో విలన్ గా కెరియర్ ప్రారంభించిన సత్యరాజ్.. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు దక్షిణాదిలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈయన పూర్తి పేరు రంగరాజ్ సుబ్బయ్య. సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి. ఈయనకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

కుమారుడి పేరు శిబి సత్యరాజ్ కాగా.. కూతురి పేరు దివ్య. కొడుకు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి డోరా, మయూన్ వంటి చిత్రాలలో నటించి మెప్పించాడు. అయితే తన కూతురు దివ్య సత్యరాజ్ గురించి అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె ఎక్కువగా బయట తిరిగింది లేదు. దివ్య న్యూట్రిషయనిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. అయితే సత్యరాజ్ అలియాస్ కట్టప్ప కూతురికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఫోటోలను చూసిన అభిమానులు హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోదుగా అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

satyaraj daughter divya have you seen her photos

ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. దివ్యకి 3 లక్షలకు పైగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ దివ్య తన ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది. అయితే గతంలో సత్యరాజ్ రాజకీయాలలోకి వస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దివ్య చెన్నైలో న్యూట్రిషియనిస్ట్ గా సేవలు అందిస్తోంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకం అయినా అక్షయపాత్రకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అయితే దివ్యకి నటనపై ఆసక్తి లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉందట. తనకు నచ్చిన వృత్తిలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. ఏదేమైనా కట్టప్ప కూతురు ఫోటోలు చూసిన నైటిజెన్లు భలే అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Admin

Recent Posts