వినోదం

శ్రీలీలకి ఆ తెలుగు హీరో అంటే చాలా ఇష్టమట.. ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో ఈ క్రేజీ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అంతేకాకుండా తనదైన నటనతో సినిమాల్లో సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ కుర్ర హీరోయిన్. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో చాన్సులు కొట్టేస్తూ భళా అనిపిస్తోంది ఈ అమ్మడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా..

ఆవిడే నండి శ్రీలీల‌. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఈ హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ ముద్దుగుమ్మకు తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాకు తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు ఇష్టమే అందరూ చాలా అద్భుతంగా నటిస్తారని చెప్పుకొచ్చింది.

sreeleela told about her favorite actor in tollywood

కానీ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే తెగ ఇష్టం. అందుకే మామూలు హీరోల కంటే డాన్స్ చేసే హీరోలు అంటే ఎక్కువ ఇష్టం. ఆ విధంగా ఎన్టీఆర్,రామ్ చరణ్, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోలు అంటూ ఒక సందర్భంలో చెప్పేసింది.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ కాబట్టి చాలా క్రేజీగా సమాధానం చెప్పిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

Admin

Recent Posts