వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో టాలెంట్ తో పాటు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ తరువాత సక్సెస్ వస్తే వరుస ఆఫర్లు వస్తాయి. కానీ అలా ఎంతో కష్టపడి సినిమాల్లో సక్సెస్ అవుతున్న క్రమంలోనే కొంతమంది టాలీవుడ్ స్టార్ లు రకరకాల కారణాలవల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. సౌందర్య.. మ‌రో సావిత్రి లా చక్రం తిప్పుతుంది అనుకున్నారు. చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి. కానీ 34 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ప్రత్యూష.. వరుసగా మంచి అవకాశాలు అందుకుంటున్న టైం లో ఈమె మరణించింది. కొంతమంది ఈమెపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

దివ్యభారతి.. స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకున్న టైములో ఈమె మరణించింది. 19 ఏళ్లకే ఈమె మరణించడం విషాదకరం. యశోసాగర్.. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం హీరో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న టైములో 25 ఏళ్లకే మరణించాడు. ఎం.ఎస్.నారాయణ.. ఈయన 63 ఏళ్ల వయసులో మరణించాడు. కానీ ఆ టైముకి ఈయన స్టార్ కమెడియన్ గా 20 కి పైగా సినిమా ఆఫర్లతో బిజీ గా ఉన్నాడు. శ్రీహరి.. విలన్ గా, హీరోగా రాణించిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు శ్రీహరి. కానీ 49 ఏళ్లకే ఈయన మరణించారు.

these actors died when their career is in peaks

టి.ఎన్.ఆర్.. నటుడిగా, జర్నలిస్టుగా కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ఈయన కరోనాతో మరణించాడు. ఈయన వయసు కేవలం 45 ఏళ్లు మాత్రమే.

Admin

Recent Posts