వినోదం

ఈ స్టార్ హీరోయిన్లు అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామంది హీరో, హీరోయిన్లు కనీసం 5 ఏళ్లు దాటిన వివాహం చేసుకోరు. ఇంకా సెట్ కావాలి అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి 40 ఏళ్లు ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అయినా వీరు వివాహం వైపు చూడడం లేదు.. అలాంటి ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్స్ అంతా 20 ఏళ్ల లోపు వివాహం చేసుకున్నారట.

ఇందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు డజన్ మంది ఉన్నారని తెలుస్తోంది.. మరి ఆ లిస్టు చూద్దామా.. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించింది దివ్యభారతి. ఈమె 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండానే మరణించింది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య శాలిని కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఈమె కూడా 21 సంవత్సరాల వయసులోనే అజిత్ ను వివాహమాడింది.

these actress married at younger age and given surprise

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అఖిల్. ఇందులో హీరోయిన్ గా చేసిన సాయోషా సైగల్ 21 ఏళ్లలోనే హీరో ఆర్యని వివాహం చేసుకుంది. మరో మలయాళ స్టార్ హీరోయిన్ నాని హీరోగా చేసిన అంటే సుందరానికి చిత్రంలో నటించిన నజరియా నజీమ్ కూడా 20 ఏళ్లలోపే వివాహం చేసుకుంది. ఇక మరో మలయాళీ బ్యూటీ అమలాపాల్ కూడా కేవలం 20 సంవత్సరాల వయసులోనే దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. బొమ్మరిల్లు సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించిన జెనీలియా కూడా 24 సంవత్సరాల లోనే వివాహం చేసుకుంది. ఈ విధంగా చిన్న వయసులో పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చారు.

Admin

Recent Posts