వినోదం

బాహుబలి సినిమాలో పాత్రలకి ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా..? వారు ఎందుకు వదిలేశారో తెలుసా..?

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే ప్రశ్నకు జ‌క్క‌న్న బాహుబ‌లి 2 ద్వారా స‌మాధానం చెప్పారు. బాహుబలి – 2 ది కంక్లూషన్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా స‌క్సెస్ అయింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన జక్కన. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపించారు. అసలు బాహుబలి సినిమాను ఏ త‌ర‌హాలోనూ వర్ణించలేము అని కామెంట్స్ చేశారు. అంత హై రేంజ్ లో ఈ మూవీని తెర‌కెక్కించారు.

సినిమాలో శివగామి పాత్రలో రమ్య కృష్ణ ఆడియన్స్ ను ఎంతో మెప్పించింది. అలాగే ప్రభాస్, రానా, అనుష్క లు కూడా తమ నటనకు ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమా మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఆ పాత్రలకి ముందుగా వేరే వాళ్ళను సెలెక్ట్ చేద్దాము అనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యే సినిమా కదా అని బాలీవుడ్ నటులను పెడదాం అనుకున్నారు. ఇంతకీ ఎవరెవరిని ఏ పాత్రకి అనుకున్నారో చూడండి. వారు చివరికి ఎందుకు చేయలేదు అంటే! బాహుబ‌లి ప్ర‌ధాన పాత్ర‌కు ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌ను అకున్నారు. కానీ తాను ఆ పాత్ర‌కు సెట్ కాన‌ని చెప్పి హృతిక్ వ‌దులుకున్నాడు. అదే ఆయ‌న ఈ మూవీని చేసి ఉంటే ఆయ‌న స్టార్ డ‌మ్ ఇంకా ఎక్క‌డికో వెళ్లి ఉండేది.

these are the actors who missed to do baahubali movie

రానా చేసిన భ‌ల్లాల దేవ పాత్ర‌ను ముందుగా బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హాంతో చేయిద్దామ‌నుకున్నారు. కానీ కుద‌ర్లేదు. ఆ పాత్ర‌ను ఆయ‌న వ‌దిలేసుకున్నారు. శివ‌గామి పాత్ర‌కు ముందుగా అల‌నాటి స్టార్ హీరోయిన్ శ్రీ‌దేవిని అనుకున్నారు. కానీ అప్ప‌టికే త‌మిళ హీరో విజ‌య్ పులి సినిమాలో ఆమె యాక్ట్ చేస్తున్నందున బాహుబ‌లికి డేట్స్ కుద‌ర‌లేదు. అలా శ్రీ‌దేవి శివ‌గామి పాత్రను వ‌దుల‌కున్నారు. ఇక త‌మ‌న్నా చేసిన అవంతిక పాత్ర‌కు ముందుగా సోన‌మ్ క‌పూర్‌ను అనుకోగా ఆ పాత్ర‌ను ఆమె వ‌దులుకుంది. అలాగే అనుష్క శెట్టి దేవ‌సేన పాత్ర‌కు ముందుగా న‌య‌న‌తారను అనుకున్నారు. కానీ 5 ఏళ్లు ఒకే సినిమా చేయ‌డం క‌ష్ట‌మ‌ని న‌య‌న‌తార ఈ మూవీని వ‌దిలేసుకుంది. ఇలా బాహుబ‌లి లాంటి పాన్ వ‌ర‌ల్డ్ మూవీని చాలా మంది న‌టీన‌టులు మిస్ చేసుకున్నారు.

Admin

Recent Posts