వినోదం

నందమూరి ఫ్యామిలీ లో హరికృష్ణ, తారకరత్నతో సహా మరణించిన ఎన్టీఆర్ వారసులు..! ఎవరంటే ?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు కుటుంబంలో గ‌తంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరి తర్వాత మరొకరు కన్నుమూశారు. రోడ్డు ప్రమాదాలు లేకపోతే అనుమానాస్పద స్థితిలో, లేదా అనారోగ్య కారణాలతో.. ఎందుకు చనిపోయారు? అనే చర్చ అప్ప‌ట్లో తెలుగు రాష్ట్రాలలో జరిగింది. అసలు నందమూరి ఫ్యామిలీనే వరుస విషాదాలు ఎందుకు వెంటాడాయి? నందమూరి ఫ్యామిలీలో ఉన్నట్టుండి ఒక్కొక్కరిగా ఎందుకు మ‌ర‌ణించారు.. అని ఆందరూ ఆలోచించారు. ఇక నందమూరి తారకరత్న కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు.

ఎన్టీఆర్ – బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం. వాళ్లే జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, లోకేశ్వరి, దగ్గుపాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి. అయితే ఎన్టీఆర్ వారసులలో కొంతమంది ఇప్పుడు ప్రాణాలతో లేరు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. డిసెంబర్ 6న కోదాడ సమీపంలోని ఆకుపాముల వద్ద జానకిరామ్ ప్రయత్నిస్తున్న కారు ట్రాక్టర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. 2018 ఆగస్టు 29న జరిగిన ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక 2022 ఆగస్టు 1వ తేదీన ఉమామహేశ్వరి మరణించారు.

these are the persons died in sr ntr family

జూబ్లీహిల్స్ లోని తన స్వగృహంలో ఆమె ఆత్మ‌హ‌త్య‌ చేసుకుని చనిపోయారు. ఎన్టీఆర్ – బసవతారకం దంపతులకు ఈమె నాలుగో కుమార్తె. ఇక గతంలోకి వెళితే ఎన్టీఆర్ కుమారుడు సాయి కృష్ణ 2004లో మరణించారు. అలాగే ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ అయితే అతని చిన్నప్పుడే మరణించడం జరిగింది. ఇక 2009లో ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ బతకడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇలా నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం అప్ప‌ట్లో అంద‌రినీ క‌ల‌చివేసింది.

Admin

Recent Posts