ప్రస్తుతం ఇండస్ట్రీలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇప్పటికీ 150 కి పైగా సినిమాల్లో చేసి స్టార్ హీరోగా, ఇంకా ఇప్పుడున్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నారు. మరి అలాంటి మెగాస్టార్ వదులుకున్న కొన్ని సినిమాలు, మిగతా హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా స్టార్ హోదాను కూడా సంపాదించి పెట్టాయట. అయితే, మధ్యలోనే ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సింగీతం శ్రీనివాసరావు రచించిన ఒక కథను చిరంజీవి చేయాల్సి ఉంది. భూలోకవీరుడు అనే టైటిల్ తో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది. ఇక అబూ బాగ్దాద్ గజదొంగ అనే సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా కూడా చేయాల్సి ఉన్నా సరే అది కూడా ఆగిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనుకుని ముందుకు వెళ్లారు. ఆ సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమా చేయాల్సి ఉంది. హిట్లర్ సినిమా తర్వాత వర్మతో సినిమా చేయాల్సి ఉన్నా సరే ఆ సినిమా కూడా ఆగిపోయింది. రెండు పాటలు కొన్ని ఫైట్లు కూడా షూట్ చేశారు. ఇక ఫ్యామిలీ సినిమాల విషయంలో దూకుడుగా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డితో ఒక సినిమా అనుకున్న సరే కొన్ని కారణాలతో ముందుకు వెళ్లలేదు. పలు ఫ్యామిలీ సినిమాలతో దూకుడుగా ఉన్న ఆదిత్యతో కూడా చిరంజీవి సినిమా చేయాలి అనుకున్న ముందుకు వెళ్లలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేయాలనుకున్నారు. రీఎంట్రీ సినిమాగా ఇది ముందుకు వెళుతుంది అని భావించారు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది.