వినోదం

నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చిరంజీవిని మొహం మీద అన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు.. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో విమర్శలు. అలా విమర్శలకు కృంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా.. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది స్టార్ నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆరుపదుల వయసు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు పడ్డారట. సినిమా మీద ఉన్న పిచ్చి తో మద్రాస్ వెళ్లి నటుడు అవుదామని ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒకానొక సమయంలో ఆయన పాండీ బజార్ వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి ఆయనను చూసి.. ఏంటి నువ్వు ఏమన్నా పెద్ద అందగాడివా.. హీరో అవ్వడానికి ఇన్స్టిట్యూట్ కి వచ్చావా.. అతన్ని చూడు అతని కంటే నువ్వు పెద్ద అందగాడివా.. నీ మొహం అద్దంలో చూసుకున్నావా. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం. ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ చిరంజీవిని ఎద్దేవా చేశారట. కానీ అతను మాట్లాడిన మాటలకి చిరంజీవి ఏ మాత్రం బాధపడలేదట.

what chiranjeevi did when somebody commented on him

ఇంటికి వెళ్లి దేవుడి దగ్గర కూర్చొని ఇప్పటినుండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అని నిర్ణయించుకున్నారట. అంతేకాదు అప్పటినుండి ఒక సంవత్సరం వరకు చిరంజీవి పొండి బజారు వైపు కూడా వెళ్లలేదట. అలా స్టార్ హీరోగా ఎదిగినప్పటి నుండి ఎవరు ఏం మాట్లాడినా మెగాస్టార్ అస్సలు పట్టించుకునే వారు కాదు. కొంతమంది ఎదుటివారిని నిందించడంతో వాళ్లు ఫేమస్ అయిపోతారు అనే ఉద్దేశంతో అలా చేస్తారు. అందుకే చిరంజీవి ఎవరి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా ఆయన పట్టించుకోరట. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Admin

Recent Posts