వినోదం

మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?

పెళ్లిపై ఒక్కొక్కరికి వేరువేరు అభిప్రాయాలు ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీకి కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది. లేదంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. బహుశా ఈ కారణం వల్లే కొంతమంది నటీనటులు పెళ్ళీడు వచ్చినా వెంటనే పెళ్లి చేసుకోలేదు. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అంటే హీరోయిన్లు అంత త్వరగా పెళ్లి చేసుకోరు. వివాహం చేసుకుంటే సినిమా అవకాశాలు రావన్న అనుమానంతో కొందరు భామలు పెళ్లికి వెనకడుగు వేస్తే.. మరికొందరు ఇతర కారణాల వల్ల పెళ్లికి దూరంగా ఉంటారు. ఇక హీరోయిన్లలో టబూ లాంటి వారు 50 దాటినా కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు. ఇక మరి కొంతమంది సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అయితే కొంతమంది భామలు మాత్రం 30 లలో పెళ్లి చేసుకున్నారు. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

హన్సిక ప్రముఖ వ్యాపారవేత్త, తన బెస్ట్ ఫ్రెండ్ సోహైల్ ని 31 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. ప్రముఖ బిజినెస్మెన్ నితిన్ రాజుని ప్రణీత 29 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు విగ్నేష్ శివన్ ని నయనతార 37 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు రన్బీర్ కపూర్ ను 29 ఏళ్ల వయసులో అలియా భట్ పెళ్లాడింది. వీరికి ఓ పాప కూడా జన్మించింది. కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని 35 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. రష్యా కి చెందిన క్రీడాకారుడు ఆండ్రీని 36 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది శ్రీయ శరణ్. వీరికి ఓ పాప కూడా ఉంది.

what is the age of these actress when they are married

తన ప్రియుడు వికాస్ వాసుని 31 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది కలర్స్ స్వాతి. అక్కినేని నాగచైతన్య ని ఈమె 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. కానీ 2021లో ఈ జంట విడాకులు తీసుకుంది. అల్లు అర్జున్ వరుడు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాను శ్రీ కారన్ మానస్ ని 37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సంజన గల్రాని చెల్లెలు.. నిక్కీ గల్రాని హీరో ఆది పినిశెట్టి ని 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది.

Admin

Recent Posts