వినోదం

పవర్ స్టార్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారంటే.. దేశంలోనే ఇదొక రికార్డు..!!

ప్రతి ఒక్కరి జీవితంలో వారి పక్కన,వెనుక ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండే ఉంటారు. పట్టు సాధించిన, పేరు సంపాదించిన వారు ఏదో ఒక సందర్భంలో వారి జీవితం లో ఉన్నటువంటి సంఘటనల గురించి వ్యక్తుల గురించి పలు సందర్భాల్లో చెప్పినప్పుడు ఈ విషయాలు మనకు బయటపడతాయి.. అలాగే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో పవర్ స్టార్ గా వెలుగొందిన పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ లోనే మంచి పేరుంది. పవర్ స్టార్ సినిమా వస్తుంది అంటే అభిమానులకు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఇలా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి, తనదైన నటనతో కష్టపడి పవర్ స్టార్ గా మారి సుదీర్ఘ కాలంగా తన హవాను కొనసాగిస్తున్నారు. ఆయన కేవలం సినిమాల పరంగానే కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయ పార్టీ పెట్టి పాలిటిక్స్ లో కూడా చురుగ్గా ఉన్నారు..

అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చి ఎంత సంపాదించారు? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసారు? అనే విషయాలు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. మనం ఎప్పుడు అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు-అంజనా దేవిల కు 1971 సెప్టెంబర్ 2వ తేదీన బాపట్ల లో జన్మించారు. ఆయనకు ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు. ఇంటర్ వరకు చదువుకున్న పవన్ కళ్యాణ్ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో తన వదిన చిరంజీవి వైఫ్ సురేఖ సహాయంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి మార్షల్ ఆర్ట్స్ అంటే తెలియని తెలుగు అభిమానులకు మార్షల్ ఆర్ట్స్ పరిచయం చేసి ఒక కొత్త కోణంలో హీరోగా తెరంగేట్రం చేశారు. ఇక అప్పటి నుంచి తన సత్తాను చూపిస్తూనే ఉన్నాడు.

what is the net worth of pawan kalyan his assets and properties

హీరోగానే కాకుండా ఇండియాలోనే ఏ స్టార్ చేయని విధంగా స్టంట్ కొరియోగ్రాఫర్ గా,డాన్స్ మాస్టర్ గా, సింగర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా చేసి ఒక రికార్డు క్రియేట్ చేసుకున్నారు. అలా అన్ని కోణాలు కలగలిపి ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఆయన ఆస్తుల విషయానికి వస్తే దాదాపుగా 150 కోట్లకు పైనే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో 100 కోట్ల విలువగల ప్రాపర్టీస్, కార్లు,విల్లాలు ఇతరాత్ర వాటితో కలిసి 50 నుంచి 100 కోట్లు ఉంటుందట. అయితే పవన్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు 40 నుంచి 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలా పవన్ సినీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకొని ముందుకుసాగారు, అలాగే ప్రజాసేవలో రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసి ముందుకు సాగాలని కోరుకుందాం..

Admin

Recent Posts