వినోదం

ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ నంబర్ ఎవరిదో తెలుసా?

మాస్ లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం ఒక్కడు. 2003 లో విడుదలైన ఒక్కడు కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. గుణశేఖర్ ఆ చిత్రానికి దర్శకుడు. ఎంఎస్ రాజు ఆ చిత్ర నిర్మాత. ఆ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు.

పాస్ పోర్టు కోసం మహేష్ బాబు అతడిని టార్చర్ పెట్టే సన్నివేశం అద్భుతంగా పడింది. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు. మొట్టమొదటిసారి ఈ ఫోన్ కు నువ్వే ఫోన్ చేయాలని కోరుతాడు. ఆ నంబర్ ని మహేష్ గ్యాంగ్ వినడం, పాస్ పోర్టు కోసం టోనీ అనే పేరుతో అతడిని విసిగించడం, చాలా సరదాగా ఉంటుంది.

what is the phone number that dharmavarapu subramanyam used in okkadu movie

ఆ ఫోన్ నెంబర్ 9848032919. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నెంబర్ గా ఎవరి నెంబర్ ఉపయోగిద్దాం అని అనుకుంటుండగా, ఎవరిదో ఎందుకు, నిర్మాత నంబర్ వాడేద్దాం అని ఎవరో సలహా ఇచ్చారట. దీనితో అదే నంబర్ ని ఉపయోగించారు. సినిమా విడుదలయ్యాక ఆ నంబర్కు కొన్ని లక్షల కాల్స్ వెళ్ళాయట. దీనితో నిర్మాత ఎంఎస్ రాజు నిజంగానే ఫోన్ నెంబర్ మార్చేసుకున్నారు.

Admin

Recent Posts