వినోదం

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. ఏమి చేస్తున్నారంటే ?

రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఒక‌ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో బాలయ్య.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మొదటి భార్య నందిని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ 1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే నందిని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతేకాదు ఆమె తన మెయింటెనెన్స్ కోసం నెలకి 5 లక్షలు పవన్ కళ్యాణ్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది. అయితే పవన్ కళ్యాణ్ 1999లో ఆమె నుంచి విడాకులు కోరగా ఆమె విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు పవన్ కళ్యాణ్.

what nandini is doing right now after divorce with pawan kalyan

మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయిని 2008లో పెళ్లి చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదుగుతూ పవర్ స్టార్ అయ్యారు. ఇక నందిని విషయానికి వస్తే పవర్ స్టార్ తో విడాకుల తర్వాత ఆమె తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2007లో విడాకులు తీసుకున్న తర్వాత 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహమాడింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నందిని కి ఐదు కోట్ల వరకు డబ్బులు కూడా ఇచ్చాడని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది.

Admin

Recent Posts