వినోదం

ఉదయకిరణ్ చనిపోవడానికి వారం ముందు ఆ దర్శకుడితో ఏమని చెప్పాడో తెలుసా ?

మనసంతా నువ్వే తర్వాత ఉదయ్ కిరణ్ వి.ఎన్.ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఓసారి అసహనానికి గురయ్యారని ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీరామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఉదయ్ కిరణ్ కు ఇతర సినిమాల షూటింగులు ఉండడంవల్ల ఆ ఒత్తిడితో అసిస్టెంట్ డైరెక్టర్ పై అరిచారని అన్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ తప్పేమీ లేదని అన్నారు. అసలు పద్ధతి ప్లాన్ లేదా ఒక రాక్షసుడిలా పని చేస్తున్నాను. ఇండస్ట్రీలో అందరూ సీనియర్ హీరోలే కానీ ఎవరికీ బుర్ర లేదా అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ గట్టిగా అరిచారని చెప్పారు. దీంతో ఉదయ్ కిరణ్ కు ఎన్ని టెన్షన్లు ఉన్నా అసిస్టెంట్ డైరెక్టర్ పై అరవడం తనకు నచ్చలేదని చెప్పారు.

what vn aditya told about uday kiran

షూటింగ్ కు ప్యాక్ ఆప్ చెప్పి మధ్యలోనే నడుచుకుంటూ వెళ్లిపోయానని చెప్పారు. దీంతో తన కెమెరామెన్, ఇతర సిబ్బంది కారు వేసుకుని వచ్చారని అన్నారు. ఉదయ్ కిరణ్ చివరిరోజుల్లో తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని, చనిపోయే వారం ముందు కూడా తనకు ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడాడని వి.ఎన్.ఆదిత్య తెలిపారు.

Admin

Recent Posts