వినోదం

బాహుబ‌లి పాత్ర కోసం…ప్ర‌భాస్…తీసుకున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్..లిస్ట్ ఇదిగో ఇంత‌లా ఉంది!?

బాహుబలి సినిమా (పార్ట్ 1, 2)తో నటుడు ప్రభాస్‌కు ఎంతటి గుర్తింపు వచ్చిందో మనందరికీ తెలుసు. ప్రభాస్‌కు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించాడు కదా. ఒకటి అమరేంద్ర బాహుబలిగా, రెండు శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ కనిపిస్తాడు. అయితే రెండు క్యారెక్టర్లలోనూ శరీరం పరంగా కొద్దిగా వైవిధ్యాన్ని చూపించారు. అమరేంద్ర బాహుబలి భారీ కాయంతో కనిపించగా, శివుడు కొంత తక్కువ శరీరంతో కనిపిస్తాడు. నిజానికి ప్రభాస్ అలా కనిపించేందుకు చాలా కష్టపడ్డాడట. ఇక అమరేంద్ర బాహుబలిగా భారీ కాయంతో కనిపించేందుకు చాలా స్ట్రిక్ట్ డైట్‌ను పాటించినట్టు తెలిసింది.

ఓ దశలో ప్రభాస్ కుటుంబ సభ్యులే అతని డైట్‌కు, ఎక్సర్‌సైజ్‌కు భయపడ్డారట. కానీ చివరకు అంతా సక్రమంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాహుబలి సినిమా కోసం ప్రభాస్ పాటించిన డైట్ ఏంటో తెలుసా..? అదేమిటంటే.. బ్రేక్‌ఫాస్ట్… ఉదయం 42 ఉడకబెట్టిన కోడిగుడ్లు (తెల్లని సొన మాత్రమే), పావు కిలో చికెన్, పండ్లను ప్రభాస్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేవాడట.

which diet prabhas followed for baahubali movie

లంచ్… బ్రౌన్ రైస్, ఓట్స్, పాస్తా, బ్రకోలి, సలాడ్స్, ప్రోటీన్ పౌడర్, సూప్, పాలు లంచ్ టైంలో ప్రభాస్ తినేవాడట. డిన్నర్… పుల్కాలు, చికెన్, పండ్లు, పాలు తదితరాలను నైట్ డిన్నర్‌లో ప్రభాస్ తీసుకునేవాడట. ఇక నిత్యం దాదాపుగా 3 గంటలకుపైనే ప్రభాస్ జిమ్ చేశాడట. దీంతో అమరేంద్ర బాహుబలిగా అంతటి భారీకాయంతో ప్రభాస్ మనకు కనిపించాడు.

Admin

Recent Posts