వినోదం

అర్జున్ ఒకే ఒక్కడు మూవీకి ముందుగా అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

డైరెక్టర్ శంకర్ అంటే ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలలో తెలియని వారు ఉండరు. తమిళ్ ఇండస్ట్రీ నుండి దర్శకుడు శంకర్ మూవీ వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ఆ మూవీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తారు. అలాంటి టాప్ దర్శకుడిగా క్రేజ్ సంపాదించిన శంకర్ కెరీర్ మొదట్లో ఆయన డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు చిత్రం మొదట మెగాస్టార్ తో చేద్దామని ప్లాన్ చేశాడట.కానీ మిస్ అయింది.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ శంకర్ కి చిరు అంటే చాలా ఇష్టం ఉండడంతో ఆయనతో మూవీ చేయాలనుకున్నాడు.కానీ అప్పటికే మెగాస్టార్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ మూవీ చేయలేకపోయానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే ఈ మూవీ అర్జున్ చేసి మంచి హిట్ అందుకున్నారు.దీని తర్వాత కూడా మెగాస్టార్ తో శంకర్ మూవీ చేయాలని చూశాడు. కానీ ఇద్దరికీ టైమ్ వర్కౌట్ కాలేదు. గ‌తంలో రోబో మూవీ ఆడియో ఫంక్షన్ కి వచ్చిన చిరు మాట్లాడుతూ చెప్పారు.

who is the first choice for arjun oke okkadu movie

కానీ ఎంత ప్రయత్నం చేసిన మా కాంబోలో మూవీ కుదరలేదు. ప్రస్తుతం శంకర్ చేసిన చిత్రాలు వరుస ఫ్లాప్ లు అవుతున్నాయి. అయితే మెగాస్టార్ తో మూవీ చేయలేక పోయినా రామ్ చరణ్ తో సినిమా చేశాడు. కానీ ఈ మూవీ కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దీంతో శంక‌ర్‌, చిరు కాంబినేష‌న్‌లో మూవీ వ‌స్తుందా, రాదా అనే విష‌యంపై తీవ్ర సందిగ్ధ‌త నెల‌కొంది.

Admin

Recent Posts