వినోదం

పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి రహస్యంగా చేయడానికి కారణం..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు. అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తన జనసేన పార్టీతో ముందుకు పోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే మొదటి భార్య నందిని గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు డైరెక్టర్ గీతాకృష్ణ వెల్లడించారు. ముఖ్యంగా మొదటి పెళ్లి పెద్దలు రహస్యంగా చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన తెలిపారు. గీతాకృష్ణ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని మాకు బంధువు, మా అక్కను ఇచ్చింది పోలవరం అలాగే నందిని వాళ్ళది కూడా పోలవరం. వాళ్లవి పెద్ద కుటుంబాలు. ఆ ఊర్లో పెద్ద కుటుంబాలకి పలుకుబడి ఎక్కువగా ఉండేది. నందిని చిన్న వయసులో ఉన్నప్పుడే చూసాము. నాగార్జున సినిమా షూటింగ్ కి వెళ్లినప్పుడు వర్షం కారణంగా వాళ్ళ ఇంట్లో కూర్చునే వాళ్ళము. అప్పుడు అమ్మాయిని చిన్ని అని పిలిచే వాళ్ళం అంటూ తెలిపారు గీతాకృష్ణ.

why pawan kalyan first marriage happened secretly

అమ్మాయిని మరోసారి కూడా చూశాను. కానీ పెళ్లి జరిగినప్పుడు నాకు తెలియదు. ముంబైలో ఉండగా మళ్లీ వాళ్ళ పెళ్లి అయ్యాక ఒకసారి నందిని వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కలిసి ఆల్బమ్ చూపించారు. పెళ్లి వాళ్ళు గ్రాండ్ గా చేయాలని అనుకున్నా పవన్ ఒప్పుకోకపోవడం వల్ల చివరి నిమిషంలో షిరిడీలో సింపుల్ గా ఎవరికి చెప్పకుండా చేశారు అంటూ తెలిపారు. ఇకపోతే వీరిద్దరూ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల విడిపోయిన విషయం తెలిసిందే.

Admin

Recent Posts