వినోదం

హీరో వెంకటేష్ సీరియస్ హీరో పాత్రల నుండి కామెడీ టచ్ ఉన్న హీరో గా ఎందుకు మారారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సీనియర్ సినీ పాత్రికేయుడు యూట్యూబ్ లో సినిమా హీరోల గురించి మాట్లాడుతూ అందరిలో వెంకటేష్ కి హిట్స్ ఎక్కువ&comma; కానీ మిగతావారిలా ప్రాపగాండా చేసుకోడు&comma; పద్ధతిగా ఉంటాడు&comma; అతి చేయాలి అనే ఆలోచన పెట్టుకోడు&period; జయాపజయాలకు స్పందించడు&period; స్టార్ హీరో అనే భావనతో ఉండడు&period;&period; అన్నారు&period; నిజమే కదా అనిపించింది&period; తన హిట్ సినిమాలు ప్రతి ఒక్కరినీ అలరించినవే&period; అయినప్పటికీ ఆవేశంగా స్పీచులు ఇస్తూనో&comma; నేనే నంబర్ వన్ అంటూనో ఎప్పుడూ కనబడలేదు&period; తనకో స్టార్ డమ్ ఉందని గొప్పలు పోలేదు&comma; స్టార్ డమ్ కు కనీస విలువ కూడా ఇవ్వలేదు&period; తన తర్వాతి తరం వారిని సైతం ప్రోత్సహిస్తూ వారితో సినిమాలు చేస్తూ&comma; ఆ సినిమాలో తన ప్రాధాన్యత తగ్గినా పట్టించుకోక ముందుకు సాగిన వైనం అతడిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదిగో ఇదే &&num;8211&semi; కామెడీ టచ్ ఉన్న సినిమాల్లో అతడిని ఎంపిక చేసుకోవడానికి మొదటి కారణం&period; కామెడీ సినిమాల్లో హీరోయిజం ఉండదు&comma; ఎలివేషన్లు ఉండవు&comma; తన మీద తాను జోకులు వేసుకోవాలి&comma; తనని తాను తగ్గించుకుని హాస్యం పండించాలి&period; ఆ పని వెంకటేష్ కన్నా ఎవరు బాగా చేయగలరు&quest; రెండవది &&num;8211&semi; అతడు పలికించే హావభావాలు&period; హాస్యాన్ని సునిశితంగా పండించడంలో అతడిది అందెవేసిన చేయి&period; అమాయకంగానూ కనబడగలడు&comma; బాధితుడిలానూ కనబడగలడు&period; అయోమయంతో కొట్టుమిట్టాడే పాత్రలనూ పోషించగలడు&period; మిగతా పాత్రధారుల చేతిలో బకరాగానూ మారగలడు&period; ఇమేజ్ చట్రంలో చిక్కుకోకపోవడం వల్ల అలాంటి పాత్రల్లో తేలికగా ఇమిడిపోగలడు&period; ప్రేక్షకులను మెప్పించగలడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82547 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;venkatesh&period;jpg" alt&equals;"why venkatesh shifted to comedy genre " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసహజమైన తెలివితేటలున్న హీరోగా కనబడడు&comma; మనలో ఒకడిలా కనబడతాడు&period; యాక్షన్ సినిమాలతోనో&comma; మాస్ ఎలిమెంట్స్ తోనో ప్రేక్షకులకు దగ్గరవడం కష్టమైన విషయం&period; కామెడీ ద్వారా మొత్తం ఫ్యామిలీకి దగ్గరయ్యే అవకాశం ఉన్నప్పుడు దర్శకులు ఆ దిశగానే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు&period; స్టార్ డమ్ తో పాటు పైన చెప్పిన అన్ని అర్హతలు ఉన్న వెంకటేష్ అందుబాటులో ఉన్నప్పుడు దర్శకులకు రెండో ఆలోచన చేయాల్సిన అవసరం కలగదు&period; మూడవది &&num;8211&semi; రెమ్యూనరేషన్&period; మిగతా నటులతో పోలిస్తే వెంకటేష్ రెమ్యునరేషన్ తక్కువే అని యూట్యూబ్ కథనాలు&period; పైగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెంకటేష్ స్వ‌యంగా ఆ మాటని ఒప్పుకున్నాడు&period; నాలుగోవది &&num;8211&semi; అవసర పడని సెపరేట్ కామెడి ట్రాక్&period; హీరోనే కామెడి పండించగలిగితే&comma; కామెడీ కోసం ప్రత్యేకంగా ట్రాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు&period; కనీసం కొన్ని పాత్రలు తగ్గుతాయి&comma; తద్వారా బడ్జెట్ కూడా ఎక్కువ అవదు&period; కామెడీ కథలో భాగం అవుతుంది&period; అలా అవకాశం ఉన్నప్పుడు దర్శకులు కూడా ఆ పంథానే అనుసరిస్తారు&period; అవే ఆఫర్ చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అడ్రినలిన్ జంకీస్ కోసం కొన్ని సినిమాలు ఉంటాయి&period; హీరో కత్తి పట్టుకుని చెరుకుగడను నరికినట్టు విలన్లని నరికేస్తూ ఉంటే&comma; భీభత్సమైన బీజియంతో చెవులు చిల్లులు పడుతూ ఉంటే&comma; నిముషానికో ఎలివేషన్ షాట్ పడుతూ ఉంటే&comma; ఆనందించే ఆ జంకీస్ కి కూడా నచ్చే సినిమాలు వెంకటేష్ మాత్రమే చేయగలడు&period; స్వర్ణకమలం&comma; శ్రీనివాస కల్యాణం&comma; వారసుడొచ్చాడు&comma; సుందరకాండ&comma; బొబ్బిలి రాజా&comma; చంటి&comma; ప్రేమించుకుందాం à°°à°¾&comma; పెళ్లి చేసుకుందాం&comma; పవిత్రబంధం&comma; ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు&comma; కలిసుందాం à°°à°¾&comma; ప్రేమంటే ఇదేరా&comma; రాజా&comma; మల్లీశ్వరి&comma; నువ్వు నాకు నచ్చావ్ వంటి ఎన్నో హిట్ సినిమాలు&period; అలాంటి ఎన్నో సినిమాల్లో వెంకటేష్ పండించిన కామెడీ మరిచిపోలేనిది&period; వెంకటేష్ తన సినిమాలతో కొందరి మనసులు గెలుచుకుంటే&comma; ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి నైజంతో మరింత మంది మనసు గెలుచుకున్నాడు&period; అలా&comma; విక్టరీ వెంకటేష్ అందరివాడు అయ్యాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts