వినోదం

సినిమా థియేటర్లు అంతరించిపోతాయా?

పోతాయనే నిన్నా మొన్నటి దాకా అనుకున్నారు. నేరుగా డిటిహెచ్ (డైరెక్ట్ టు హోమ్) రిలీజ్ చేయాలని కమల్ హాసన్ తన సినిమా విశ్వరూపం గురించి అనుకున్నారు. థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిర్మాతలకు డిటిహెచ్ రిలీజ్ మరో రెవెన్యూ సోర్స్ అవుతుంది అని కమల్ అంటే, ఎక్కువమంది ఒకచోట చేరి, తక్కువ ఖర్చుతో సినిమా చూసే అవకాశం ఉన్నదని, అది సినిమా హాళ్లకు వచ్చేవారి సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని థియేటర్ ఓనర్లు వాదించారు. కమల్ హాసన్ ఒకడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది.

దరిమిలా, కరోనా సమయంలో ఓటిటి విజృంభించి, థియేటర్ వెళ్ళేవారి సంఖ్యను తగ్గించింది. థియేటర్ల పరిస్థితి పైన ఎందరికో ఎన్నో అనుమానాలను వచ్చేలా చేసిన సమయమది. కొన్ని థియేటర్లు మూతబడ్డాయి. అయితే – దాని కారణం ఓటిటి కాదు. మల్టీప్లెక్సులు. పాతకాలం నాటి థియేటర్ల స్థానే సరిక్రొత్త అనుభూతిని ఇచ్చే థియేటర్లు రాజ్యమేలుతున్నాయి.

టీవీ, కంప్యూటర్ స్క్రీన్స్ ఇవ్వని అనుభూతిని ఇచ్చే విధంగా థియేటర్లలో మార్పులు చేస్తే, ప్రేక్షకులను కోల్పోయే పరిస్థితి ఉండదు. ఇప్పటికే మన దేశంతో సహా ఎన్నో దేశాలలో సినిమా హాళ్లలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమా రెవెన్యూలో అగ్రభాగాన్ని అందిస్తూనే ఉన్నాయి. కాలంతో పాటు మారాల్సిన అవసరం థియేటర్లకూ కలిగింది. మార్పుని స్వాగతించిన థియేటర్లు ఇంకో పదికాలాలు ఉంటాయి.

Admin

Recent Posts