వ్యాయామం

పాదాల‌తో ఈ వ్యాయామాలు చేసి చూడండి..! దాని ఫ‌లితాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది..!

మ‌న శ‌రీరంలో కాళ్ల పాదాలు చాలా ముఖ్య‌మైన అవ‌య‌వాలు. అవి లేనిదే మ‌నం ఎక్క‌డికీ వెళ్ల‌లేం. నిల‌బ‌డ‌లేం. ఓ ర‌కంగా చెప్పాలంటే ఏ ప‌నీ చేయ‌లేం. కాలి పాదాలు అనేవి మ‌న శ‌రీరానికి బేస్ లాంటివ‌ని ఆయుర్వేదం కూడా చెబుతోంది. ఈ క్ర‌మంలో మ‌నం నిత్యం పాదాల‌తో కూడ ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి. కానీ చాలా మంది కాళ్ల వ‌ర‌కే వ్యాయామాల‌ను చేస్తారు. అయితే పాదాల‌తో కూడా వ్యాయామం చేస్తే దాంతో ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. దీంతో ఇంకా ఇత‌ర లాభాలు కూడా మ‌న‌కు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలో పాదాలతో చేసే వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టో ప్రెస్సింగ్‌ (పాదాల‌తో ఒత్తిడి క‌లిగించ‌డం).. ఈ వ్యాయామం చేయ‌డం చాలా తేలిక‌. పాదాల‌ను పూర్తిగా నేల‌పై ఆన్చ‌కుండా మునివేళ్ల‌తో నిల‌బ‌డి 3 సెకండ్ల పాటు అలాగే ఉండాలి. అనంత‌రం కొంత స‌మ‌యం ఆగి మ‌ళ్లీ అలాగే చేయాలి. ఇలా రోజుకు క‌నీసం 10 సార్లు చేస్తే దాంతో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

టో వాకింగ్ (ముని వేళ్ల‌పై న‌డ‌వ‌డం).. ఇది పైన చెప్పిన వ్యాయామాన్ని పోలి ఉంటుంది. కాక‌పోతే ఇందులో పాదాల ముని వేళ్ల‌తో న‌డ‌వాల్సి ఉంటుంది. అలా 20 – 30 సెకండ్ల పాటు నడిచాక కొన్ని సెకండ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ 20 -30 సెకండ్ల పాటు మునివేళ్ల‌తో న‌డ‌వాలి. ఇలా క‌నీసం 3 నుంచి 5 సార్లు చేస్తే దాంతో కాళ్లు దృఢంగా మారుతాయి. కండ‌రాల నొప్పులు త‌గ్గిపోతాయి. యాంకిల్ స‌ర్కిల్స్ (మ‌డిమ‌లు).. కుర్చీపై కూర్చుని ఏదైనా ఒక కాలును దూరంగా చాచి కేవ‌లం పాదాన్ని మాత్ర‌మే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్ష‌న్‌లో వృత్తం ఆకారంలో తిప్పాలి. అంటే గ‌డియారం ముళ్లు తిరిగే దిశ‌కు వ్య‌తిరేక దిశ అన్నమాట‌. అలా 10 సెకండ్ల పాటు చేశాక‌, మ‌రో కాలుకు కూడా చేయాలి. ఇలా కాళ్ల‌ను మారుస్తూ రోజుకు క‌నీసం 5,6 సార్లు ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను చేయాల్సి ఉంటుంది.

do these feet exercise daily for your health

రెసిస్టెడ్ ఫ్లెక్సియ‌న్.. ఏదైనా ఒక పోల్‌కు ఒక ఎక్సర్‌సైజ్ బ్యాండ్ వేసి దాంట్లో పాదాన్ని పెట్టాలి. అనంతరం పాదాన్ని వెనక వైపుగా లాగాలి. ఇలా 5 నుంచి 8 సెకండ్ల పాటు చేశాక పాదం మార్చాలి. ఇలా రోజుకు 5, 6 సార్లు చేస్తే కండ‌రాలు దృఢంగా మారుతాయి. కాలి నొప్పులు పోతాయి. టాప్ పెన్సిల్ పిక‌ప్స్.. నేల‌పై నిల‌బ‌డి పాదాన్ని పైకి లేపి దాని ముని వేళ్ల‌తో నేల‌పై ప‌డి ఉన్న పెన్సిల్‌ను అందుకుని, అనంత‌రం పాదాన్ని పైకి లేపి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్నాక, మ‌ళ్లీ పెన్సిల్‌ను కింద వేసి ఇంకో పాదంతో అలాగే చేయాలి. ఈ వ్యాయామాన్ని రోజుకు 5 సార్లు చేయాల్సి ఉంటుంది. దీంతో కాలి నొప్పులు త‌గ్గుతాయి. పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Admin

Recent Posts