వ్యాయామం

ఈ ప‌రిస్థితుల్లో అస‌లు వ్యాయామం చేయ‌కూడ‌దు.. చేస్తే ప్ర‌మాదం..

ప్రతిరోజూ జిమ్ కు వెళ్ళి శరీరాన్ని కఠినంగా శిక్షిస్తున్నారా? శరీరానికి విశ్రాంతి కూడా ఏంతో ప్రధానం అంటారు వ్యాయామ నిపుణులు. అయితే, వ్యాయామాలు ఏ ఏ సందర్భాలలో మానేసి శరీరానికి విశ్రాంతి నివ్వాలో పరిశీలించండి. ఆరోగ్యం సరిగా లేనపుడు – ఆరోగ్యం సరిగా లేనపుడు డాక్టర్లు సైతం జిమ్ కు వెళ్ళవద్దంటారు. చిన్నపాటి జలుబు చేసినా సరే వ్యాయామం మానేయండి. జలుబుగా వున్నపుడు మీరు చేసే వర్కవుట్లు మీ శారీరక రోగ నిరోధక వ్యవస్ధపై ఒత్తిడి చూపి రికవర్ అవ్వాలంటే మరింత సమయం పట్టేలా చేస్తాయి.

అలసి ఒత్తిడితో వుంటే – ఒత్తిడి తగ్గించుకోవాలంటే జిమ్ సరైన ప్రదేశమే కాని కొన్ని సార్లు మీ శరీరం బ్రేక్ కావాలని కోరుతుంది. టెన్షన్ అధికంగా వున్నపుడు వ్యాయామాలు హానికరం. గాయపడినపుడు – చిన్నపాటి గాయమైనా నిర్లక్ష్య పరిస్తే పెద్దదై మరింత బాధిస్తుంది. కనుక శరీరానికి ఈ సమయంలో విశ్రాంతినివ్వండి.

you should not do exercise in these conditions

హేంగోవర్ – రాత్రి పార్టీ జరిగింది. లిక్కర్ తాగి లేట్ గా ఇంటికి వచ్చారు. మరుసటిరోజు ఉదయం వ్యాయామం చేయకండి. ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఒక యూనిట్ ఆల్కహాల్ ప్రాసెస్ చేయాలంటే శరీరానికి ఒక గంటైనా పడుతుంది. ఇటువంటపుడు జిమ్ మానేసి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినేసి రొటీన్ పని మొదలుపెట్టండి.

Admin

Recent Posts