food

మ‌సాలా బీన్స్ కూర‌ను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..!

మార్కెట్‌లో మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్‌ను చాలా మంది తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. బీన్స్‌తో కొంద‌రు ఫ్రై లేదా కూర చేసుకుని తింటారు. బిర్యానీ, పులావ్ లేదా ఫ్రైడ్ రైస్‌, నూడుల్స్ వంటి వాటిల్లో బీన్స్‌ను క‌ట్ చేసి వేస్తుంటారు. అయితే బీన్స్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా మ‌సాలా కూర‌ను చేస్తే ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే మ‌సాలా బీన్స్ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, ఈ కూర‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..

సోయా చిక్కుళ్లు 1/4 కేజీ, ఉల్లిపాయలు 100 గ్రా., టొమోటోలు 50 గ్రా., వెల్లుల్లి 25 గ్రా., అల్లం 15 గ్రా., పచ్చిమిర్చి 10 గ్రా., పసుపు తగినంత, ఛాట్ మసాలా 2 టీస్పూన్లు, నూనె సరిపడా, ఉప్పు తగినంత.

beans masala curry recipe in telugu make like this

తయారు చేయు విధానం :

సోయా చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి ఆపై కుక్కర్‌లో పది నిమిషాలు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, టొమోటో, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగిపెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేగాక.. ఉల్లిపాయలు, టొమోటో ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. ఆపై పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చిక్కుళ్ళు వేసి రెండు నిమిషాలు వేయించాక రెండు కప్పుల నీళ్ళు పోసి మరో పది నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. చివర్లో ఛాట్‌మసాలా చల్లి.. వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది.

Admin

Recent Posts