food

మీకు పొట్టిక్కలు ఇడ్లీ తెలుసా …. కోనసీమ స్పెషల్ !

రాయలసీమ, తెలంగాణా యే కాదు, బహుశా మిగిలిన రాష్ట్రాలలో కూడా తెలియని స్పెషల్ ఇడ్లీ … పొట్టిక్కలు ఇడ్లీలు! కారణం ఈ ఇడ్లీలను పనసాకులలో ఉడికిస్తారు. దానివలన వీటికి ఒక స్పెషల్ వాసన, రుచి ఉంటుంది. ఇందుకు గాను పనసాకులను చుట్టి, సన్న పుల్లలతో విస్తరాకులను పిన్ చేసినట్లుగా, కోన్ షేప్ లో గాని, బుట్ట షేప్ లో కానీ తయారు చేస్తారు. అందులో ఇడ్లీ పిండి వేసి , మామూలుగా నే ఇడ్లీ కుక్కర్ లో ఉడికిస్తారు. పనస ఆకులు తెచ్చుకుని ఇలా తయారుచేసి కానీ ఇడ్లీలు రెడీ కావు కాబట్టి ఈ ఇడ్లీల ధర మామూలు ఇడ్లీలకన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది.

ఈ ఇడ్లీ ధర రాజమండ్రి వద్ద ఒకటికి 20/- రూపాయలు మాత్రమే. పనసచెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నే ఈ ఇడ్లీలు దొరుకుతాయి. పనస ఆకులు సప్లై లిమిటెడ్ కా ఉంటుంది కాబట్టి ఈ ఇడ్లీలు కావాలంటే ఉదయం 8–8.30 గంటల లోపే అయిపోతాయి. కాబట్టి త్వరగా వెళితేనే అవి దొరుకుతాయి.

do you know about konaseema special pottikkal idli

ఇలా ఆకులను చుట్టి ఇడ్లీలు చేయడం కోనసీమకే పరిమితం కాలేదు. కర్నాటక లో మంగళూర్, ఉడిపి లలో కూడా చేస్తున్నారు. నిజానికి పనస ఆకులే కాక వేరే విధమైన ఆకులు మొగిలి పూవులు, పసుపు ఆకులు , అరటి ఆకులు ఇలా అనేక విధమైన ఆకులతో పండుగల సమయం లో, ప్రత్యేకంగా తయారు చేస్తారట. అవి కూడా స్థూపాకారం లో ఎక్కువగా చేస్తారట. ఇలాగే వేరే ప్రాంతాలలో ఎక్కడైనా ఇలా ఆకులు చుట్టి ఇడ్లీలు చేస్తే క‌చ్చితంగా ఆరగించండి.

Admin

Recent Posts