food

పోషకాల ‘పాలక్ పన్నీర్’ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే&period; వారంలో కనీసం రెండు సార్లు అయినా ఆకుకూరలు తినమని డాక్టర్లు చెపుతూ ఉంటారు&period; కాని ఆకుకూరలు అనగానే ఆకుకూర పప్పు లేదా వేపుడు చేసుకుంటాం&period; కొంచెం వెరైటీ గా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తే అన్ని రకాల పోషక విలువలు అందుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలక్ పన్నీర్ కర్రీ కి కావలసిన పదార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 కప్పుల పాలకూర&comma; 2 కప్పుల పన్నీర్&comma; &half; కప్పు టమాటో పేస్ట్&comma; 1 కప్పు ఉల్లిపాయ తరుగు&comma; 2 పచ్చిమిర్చి&comma; 25 గ్రాముల బటర్&comma; 1 &half; టీ స్పూన్ అల్లం&comma;వెల్లుల్లి పేస్ట్&comma; 1 టీ స్పూన్ సోంపు&comma; 2 యాలకులు&comma; జీడి పప్పు&comma; లవంగాలు&comma; దాల్చిన చెక్క&comma; జీలకర్ర&comma; చిటికెడు పంచదార&comma; 1 టి స్పూన్ కారం&comma; ఉప్పు&comma; ¼ స్పూన్ పసుపు&comma; 1 స్పూన్ గరం మసాలా&comma; ¼ కప్పు నీళ్ళు&comma; 2 స్పూన్ల క్రీమ్ పాలకూర ని శుభ్రం చేసుకుని మిక్సి జార్లో పచ్చి మిర్చి&comma; పాలకూర వేసి ప్యురీ సిద్దం చేసుకోవాలి&period; పన్నీర్ ని ముక్కలు గా కట్ చేసి వేడినీటిలో నాన పెట్టాలి&period; సోంపు యాలకుల‌ పొడి రెడీ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71200 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;palak-paneer&period;jpg" alt&equals;"how to make palak paneer curry recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారి విధానం &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టవ్ వెలిగించి కడాయి పెట్టి బటర్ వేసి జీడి పప్పు దోరగా వేయించి పక్కన పెట్టాలి&period; దానిలో జీలకర్ర&comma; చెక్క&comma; లవంగాలు వేసి వేగాక ఉల్లిపాయ తరుగు&comma; ఉప్పు వేసి మెత్తబడేవరకు వేగనివ్వాలి&period; తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ &comma; టమాటో పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి&period; తరువాత పన్నీర్ ముక్కలు&comma; పాలకూర ప్యురీ&comma; పసుపు&comma; కారం&comma; గరం మసాల&comma; సోంపు మరియు యాలకుల పొడి వేసి బాగా కలపాలి&period; నీళ్ళు పోసి మూడు నిమిషాలు సన్న మంట మీద ఉడికించాలి&period; అంతే వేడి వేడి పాలక్ పన్నీర్ కూర రెడీ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts