హెల్త్ టిప్స్

బెడ్‌పై ప‌డుకున్నాక కేవ‌లం 60 సెకండ్ల‌లోనే నిద్ర‌లోకి జారుకునే ట్రిక్ ఇదిగో..!

నిద్ర అనేది ప్ర‌తి మ‌నిషికి అత్యంత అవ‌స‌రం. నిద్ర లేక‌పోతే మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్యాలు వ‌స్తాయి. రోజుకు స‌రిప‌డా నిద్ర‌పోతేనే మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. అయితే నేటి ఆధునిక ప్ర‌పంచంలో నిత్యం అనేక సంద‌ర్భాల్లో ఒత్తిళ్ల‌కు, ఆందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న కొంద‌రు రాత్రి పూట నిద్ర పోవాలంటే ఇబ్బందులు ప‌డుతున్నారు. నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌పోవ‌డంతో ఎక్కువ సేపు మెళ‌కువ‌గా ఉండి ఎప్పుడో అర్థ‌రాత్రి ప‌డుకుని తెల్లారి టైం దాటాక నిద్ర లేస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తోంది. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన ఓ సింపుల్ ట్రిక్‌ను ట్రై చేసి చూడండి. ఈ ట్రిక్‌ను ఫాలో అయితే ప‌డుకున్నాక కేవ‌లం ఒక నిమిషంలోనే నిద్ర‌లోకి జారుకోవ‌చ్చు. ఆ ట్రిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప‌డుకున్నాక కేవ‌లం ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకోవాలంటే ఓ ట్రిక్‌ను ఫాలో అవాలి. అయితే అందుకోసం ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం, ట్యాబ్లెట్లు మింగ‌డం లాంటి ప‌నులు చేయాల్సిన ప‌నిలేదు. సింపుల్‌గా శ్వాస తీసుకోవ‌డంపై నియంత్ర‌ణ ఉంటే చాలు. ఈ ట్రిక్‌ను ఎవ‌రైనా ప్ర‌యత్నించ‌వ‌చ్చు. దీన్నే 4-7-8 బ్రీత్ టెక్నిక్ అని పిలుస్తారు. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఆండ్రూ వెయిల్ ఈ ట్రిక్‌ను క‌నుగొన్నారు.

4 7 8 breath technique follow this for quickly fall asleep

నాలుక‌ను నోటి లోప‌ల పై భాగాన్ని ట‌చ్ చేసేలా ఉంచాలి. అలా ఉంచాక 4 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోప‌లికి ముక్కు ద్వారా పీల్చాలి. అనంత‌రం 7 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోప‌ల అలాగే బంధించాలి. త‌ర్వాత 8 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను మొత్తాన్ని నోటి ద్వారా బ‌య‌ట‌కు పెద్ద‌గా విజిల్ సౌండ్ మాదిరిగా వ‌చ్చేలా గాలిని బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. ఇలా రోజుకు 4 సార్లు చేయాలి. దీని వ‌ల్ల కొద్ది రోజుల్లోనే మీరు మార్పును గ‌మ‌నిస్తారు. ప‌డుకున్నాక వెంట‌నే నిద్ర‌పోగ‌లుగుతారు.

Admin

Recent Posts