హెల్త్ టిప్స్

వెంట్రుకలకు రంగు వేసుకుంటే ఏయే వ్యాధులు వ‌స్తాయో తెలుసా..?

మధ్య వయస్సుకు చేరిన స్త్రీ పురుషులు ఎవరి కైనా జుట్టు క్రమేణా తెల్ల బడటం సహజం, దాన్ని దాచి పెట్టీ నల్లరంగు dye లు వేస్తుంటారు, ఇందులో తప్పు ఏమీ లేదు, ఎందుకంటే…అందంగా కనిపించాలని యే మనిషి కైనా ఉంటుంది, వయస్సుతో నిమిత్తం లేదు, అందంగా కనిపించాలంటే ముందుగా ఆరోగ్యం ఉండాలి, నడి వయస్సుకు అంటే 40–45 కి చేరిన వారికి ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులైన బీపీ సుగర్ వెంట పడుతున్నాయి, వాటిని తప్పించు కోవాలంటే శరీర ఆకృతి మీద శ్రద్ధ పెట్టడం తొలి అడుగు.

ఆ క్రమంలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకల్ని నల్లగా చేయడానికి chemical కలిసిన dye తప్ప మరో మార్గం లేదు, ముఖ్యంగా వీటిలో వాడే PPD అనే రసాయనిక పదార్థం కొంత మేరకు హాని చేస్తుంది, మరీ జబ్బుల్ని కొని తెచ్చుకోవడం వంటిది ఏమీ ఉండదు గానీ ఏళ్ళ తరబడి కెమికల్స్ కలిపిన dye లు వాడితే ముఖ భాగంలో allergy కణజాలం, Anti bodies పెరిగి, ఆపైన ఎండలో తిరిగితే వాటి ప్రభావం కారణంగా చెంప భాగాలు రెండు వైపులా Dark shades వస్తాయి, అప్పటికి వయసు 50 + కి చేరి ఉంటారు! వయసు వేడి కొంత తగ్గుతుంది.

are there any side effects if you use hair dye

ఇక అప్పుడైనా PPD mix చేసినdye లు మానకుంటే చెంపలపై shades అంత తేలికగా వదలవు, PPD కి తోడు వెంట్రుక చీలికకు, పొడి బారడానికి కారణమయ్యే అమ్మోనియా, peroxide వంటివి కూడా కలుపుతారు, ఇవన్నీ dye చేసుకునే వారికి కొంత ఇబ్బంది కరమైన పరిస్థితిని dye చేసిన రెండు మూడు రోజులు కలిగిస్తాయి, చివరికి ముఖంపై నల్ల మచ్చల రూపంలో స్థిర పడతాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా నేచురల్ గోరింటాకు, ఉసిరి పొడి, నీలి ఆకుల తో తయారు చేసిన powder వాడవచ్చు, అయితే ఇది జుట్టుకు బాగా పట్టాలంటే అది అప్లయ్ చేసి కనీసం రెండు గంటలు ఉంచు కోవాలి, పైగా natural dye పేరుతో మార్కెట్ లో దొరికే పౌడర్లు ఏవైనా చాలా ఖరీదు ఉంటాయి, chemical dye లాగా 2–3 వారాలు ఇవి నల్లగా ఉంచవు, కాబట్టి ఎక్కువ మంది మొగ్గు చూపరు.

ఒక సౌ కర్యం కావాలంటే, దాని వెంటే సహజంగా ఒక అసౌకర్యం కూడా ప్యాకేజీ గా వస్తుంది, ఈ dye ల ఎపిసోడ్స్ కూడా అంతే, మరీ ప్రమాదకర అనారోగ్యం ఏమీ రాదు, అలాంటి వి వస్తాయని ఏ పరిశోధనలోనూ తేలలేదు! Beauty clinics, saloons వారు ముఖం మీద నల్ల మచ్చల్ని, shades ని పోగొడతామని చెప్పి lengthy process లోకి దిగమంటారు, ముఖం మీద నలుపు రంగు shades ఏర్పడటానికి చాలా కారణాలు ఉంటాయి, మెలనిన్ తక్కు వైనా నల్ల మచ్చలు వస్తాయి, వాటికి laser treatments కొంత మేర పని చేస్తాయి, కానీ dye కారణంగా వచ్చిన డార్క్ shades ఏమి చేసినా పోవు, dye చేయడం మానితేనే కొంతకాలానికి ఉప శ మిస్తాయి!

Admin

Recent Posts