హెల్త్ టిప్స్

చికెన్, మటన్ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..?

ప్రస్తుతం మార్కెట్లో మాంసాహారం తినే వారికి రకరకాల మాంసాహారాలు అందుబాటులో ఉంటున్నాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా రకరకాల మాంసాహారాలు మనకు లభిస్తున్నాయి.

కానీ ఇందులో చాలా మంది రెగ్యులర్ గా చికెన్, మటన్ మాత్రమే తింటూ ఉంటారు. మరి ఇందులో ఏది తింటే మంచిది? వీటి ద్వారా మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్ లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. చికెన్ స్కిన్ తో తింటే కొవ్వు ఎక్కువగా లభిస్తుంది. అందుకే చికెన్ ను ఎప్పుడూ కూడా స్కిన్ లేకుండానే తినాలి. కండరాల సమస్యలు ఉన్నటువంటి వారు జిమ్ చేసే వారు, శారీరకంగా కష్టపడేవారు ఎక్కువగా చికెన్ తింటే మంచిది.

chicken and mutton which one gives best health

మటన్ లో ఎక్కువగా కొవ్వు, కొలెస్ట్రాల్,ప్రోటీన్స్ ఉంటాయి. మటన్ ఎంత లేతగా ఉంటే అంత మంచిది. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హైబీపీ, గుండెజబ్బులు ఉన్నవారు లేత మటన్ తింటే చాలా మంచిది. లేత మటన్ అనేది చికెన్ కన్నా మంచిది. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు చికెన్ ని దూరంగా ఉంచాలి. ఎందుకంటే అందులో సోడియం ఉంటుంది. కాబట్టి చికెన్,మటన్ తినే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts