హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

డయాబెటిస్ ఉన్నవారు అన్నీ తినలేరు. ఈ వ్యాధితో బాధపడేవారు ఏ పదార్థం తింటున్నామని తప్పక గుర్తుంచుకోవాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగిపోవచ్చు. ఉదయం అల్పాహారం మొదలుకుని భోజనం, రాత్రి భోజనం వరకు తినే ప్రతి పదార్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది.ఈ చర్యతో మీ శరీరం అనారోగ్యాలకు నిలయం అవుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలి.. ఏం తినవద్దు.. అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే కింద చెప్పిన ఆహారాలు, సూచనలు పాటించి మధుమేహాన్ని తగ్గించుకోండి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా నిషేధించాలి. ఉదయం అల్పాహారం కోసం కేలరీలను పెంచని, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించే ఆహారాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు మొలకెత్తిన ధాన్యాలు లేదా అవిసె గింజలు, మఖానా వంటి తక్కువ-GI, ఫైబర్ అధికంగా ఉండే స్నాక్స్‌ను ఎంచుకోవచ్చు. గింజల్లో శరీరానికి అవసరమైన మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి శక్తిని అందించడమే కాకుండా విటమిన్ శోషణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాయంత్రం స్నాక్స్ కోసం వాల్‌నట్స్, బాదం వంటి గింజలను ఎంచుకోండి. అలాగే ఉప్పు లేని గింజలను ఎంచుకోండి. ఎందుకంటే అవి రక్తంలో చక్కెరను కూడా నియంత్రణలో ఉంచుతాయి.

diabetic people should take these foods to control sugar levels

మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ పండ్లలో గ్లూకోజే ఉంటుంది. మిగిలిన వాటితో పోల్చిన ఆపిల్, జామ, బేరి, నారింజ పండ్లలో తక్కువ GI ఉంటుంది. కాబట్టి ఈ పండ్లనే ఎంచుకోండి.ఒక కప్పు టీ లేదా కాఫీ తక్షణ శక్తిని పెంచడానికి మంచి ఛాయిస్. కానీ టీ, కాఫీలో కెఫిన్ మాత్రమే కాకుండా చక్కెర కూడా ఉంటుంది. చక్కెర ఉన్న‌ పానీయాలు తాగద్దు కాబట్టి ఇన్ఫ్యూజ్డ్ వాటర్, వేడి సూప్‌లు, కొబ్బరి నీళ్లు లేదా స్మూతీలు వంటి ప్రత్యామ్నాయాలను ప్రయత్నించండి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చూస్తాయి.

Admin

Recent Posts