హెల్త్ టిప్స్

మామిడి పండ్ల‌ను తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌కండి..!

మామిడి పండ్లు తిన్న వెంటనే కొన్ని ఆహారాలు, పానీయాలు తాగడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, మామిడి పండ్లను ఇతర పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, శీతల పానీయాలు మరియు మామిడి స్మూతీలతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. మామిడి తిన్న తర్వాత వెంటనే నిద్రపోవడం, శారీరక వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. మామిడి పండ్లను తిన్న తర్వాత ఈ పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.

మామిడి పండ్లను తిన్న తర్వాత మళ్ళీ ఇతర పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలు వస్తాయి. శీతల పానీయాలు, మామిడి స్మూతీలు.. ఈ పానీయాలు కూడా జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. మామిడి పండు తిన్న వెంటనే మసాలా అధికంగా ఉన్న వంటకాలను తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గుండెల్లో నొప్పి వంటివి వస్తాయి.

do not do these after eating mangoes

మామిడి పండ్లు తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు వస్తాయి. మామిడి పండ్లు తిన్న తర్వాత వెంటనే బరువులు ఎత్తడం, వ్యాయామాలు చేయడం మంచిది కాదు. మామిడి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మామిడి పండ్లు వాత దోషాన్ని సమతుల్యం చేస్తాయి. పచ్చి మామిడికాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. మామిడి పండ్ల‌లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాపర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Admin

Recent Posts