హెల్త్ టిప్స్

ఉదయం పూట డియోడరెంట్లు ( స్ప్రే) వాడడం మంచిది కాదు, ఎందుకో తెలుసా?

ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని, స్నానం చేసి, హడావుడిగా బట్టలు ధరించి, గప్ గప్ మంటూ వాసనలు వచ్చే డియోడరెంట్ కొట్టి టిప్పుటాప్ గా బయటికి వెళుతున్నారా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. అంతా ఒకే కానీ ఆ డియోడరెంట్ దగ్గర ఒక్క సారి కాస్త జూమ్ చేసి మాట్లాడుకుందాం. డియో వల్ల ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఉదయం పూట డియోడరెంట్ కొట్టుకోవడం కరెక్ట్ కాదట.! అలా చేయడం వల్ల స్వేదరంధ్రాలు మూసుకుపోయి, మన శరీరానికి ఇబ్బందిని కలుగజేస్తాయట.

ఈ డియోడరెంట్స్ పడుకోవడానికి ముందు సమయంలో వాడటం చాలా మంచిదట. ఇదే విషయాన్ని క్లినికల్ వైద్య నిపుణులు ఈ విషయం గురించి చాలా క్లియర్ గా చెబుతున్నారు. ఇలా చేయడం వలన స్వేద రంధ్రాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఒక మంచి డియోడరెంట్ వాడటం వలన అది సుమారుగా 24-48 గంటలదాకా పనిచేస్తుంది, స్నానం చేసినా మీ శరీరం పొడిగానే ఉంటుంది. మళ్ళీ డియోడరెంట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు.

do not use deodorant in the morning know why

ఇంకా చెప్పాలంటే స్వేదగ్రంధులు ఉదయం చాలా చురుకుగా ఉంటాయట. అందుకని ఉదయం సమయంలో చాలావరకు డియోడరెంట్ కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. అయితే చాలామంది స్నానం ఎక్కువగా ఉదయం సమయంలో చేస్తారు కాబట్టి, ఈ డియోడరెంట్స్ మార్నింగ్ టైమ్ లో యూజ్ చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ స్నానం చేయకపోయినా కూడా ఉదయం వేళల్లో వాడటం అంత మంచిది కాదు. రాత్రి సమయాలలో డియోడరెంట్స్ వాడ‌డం వలన అల్యూమినియం లవణాలు అప్పటికే స్వేదనాళాలుగా మారి ఉంటాయి. అవాంచిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం వల్ల శరీరం నుండి వచ్చే దుర్వాసనను చాలా మటుకు తగ్గించుకోవొచ్చు..అంతే కానీ ఈ డియోడరెంట్ ల మీద అంతగా ఆధారపడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు.

Admin

Recent Posts