హెల్త్ టిప్స్

గ‌రిక‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..? తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..!

వినాయకునికి నైవేద్యంగా గరికను సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే. గణపతి దేవాలయాల్లో గరిక‌ను విరివిగా ఉపయోగిస్తారు. అయితే గరికతో ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? దీని వినియోగం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గ‌రిక‌ మీ ఆరోగ్య సమస్యలను ఎలా నయం చేస్తుందో తెలుసుకుందాం పదండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దురద లేదా అలర్జీ ఉంటే గరిక గడ్డిని కషాయం చేసి తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

గరిక రసాన్ని తీసి అందులో కాస్త నిమ్మరసం, మరికొంత తేనె కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రనాళానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు నయమవుతాయి. తలనొప్పి, మైగ్రేన్ సమస్య ఉన్నవారు దీన్ని బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని మీ నుదుటిపై రాసుకుని కొంత సేపు హాయిగా పడుకోండి. నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. గరిక గడ్డి రసంలో కొంచెం బెల్లం కలుపుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పీసీఓడీ, రుతుక్రమ సమస్యలు, అధిక రక్తస్రావం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

garika has many wonderful health benefits know about them

అజీర్ణం, కడుపు ఉబ్బరం, పులుపు, మలబద్ధకం సమస్యతో సహా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు గరిక గడ్డి దివ్యౌషధం. ఇది శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. రక్తం స్వచ్ఛంగా ఉండాలంటే గరికె గడ్డిని మీ డైట్‌లో భాగం చేసుకోండి. గరిక గడ్డి రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం మంచిది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది.

Admin

Recent Posts