హెల్త్ టిప్స్

మీ పిల్ల‌ల బ్రెయిన్ ప‌వ‌ర్ పెరిగి వారు చ‌దువుల్లో రాణించాలంటే వీటిని పెట్టండి..!

పిల్లల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు కచ్చితంగా చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యం బాగుండేటట్టు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో చిన్నతనంలోనే చాలామంది పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల బ్రెయిన్ పవర్ పెరగాలన్నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా కచ్చితంగా మంచి డైట్ ని పిల్లలు తీసుకుంటూ ఉండాలి. పిల్లల్లో బ్రెయిన్ పవర్ కూడా పెరిగేటట్టు చూసుకోవాలి. పిల్లల బ్రెయిన్ పవర్ పెరిగితే చదువులో కూడా ముందుంటారు.

జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ కి సహాయపడుతుంది. పిల్లల బ్రెయిన్ పవర్ పెరగడానికి నట్స్, గింజలు వంటివి పిల్లలకి ఇవ్వండి. వీటితో బ్రెయిన్ బాగా ఆరోగ్యంగా ఉంటుంది. మోనోస్యాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే పోషక పదార్థాలను పిల్లలకి అందేలా చూసుకోవాలి ఇది పిల్లలకి ఎంతగానో సహాయపడుతుంది వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి తోడ్పడుతుంది. మెదడు బాగా పనిచేస్తుంది.

give these to your kids to increase their brain power

పిస్తా వంటి వాటిని పిల్లలకి డైట్లో ఇవ్వండి. ఫైటో కెమికల్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి దాంతో మెదడు షార్ప్ గా మారుతుంది. పిల్లల బ్రెయిన్ పవర్ ని పెంచేందుకు గుమ్మడి గింజలు కూడా ఇవ్వండి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి పిల్లలకి మెమరీ పవర్ బాగా పెరగాలంటే మీరు ఇండోర్ గేమ్స్ ని కూడా ఆడించవచ్చు. పిల్లల బ్రెయిన్ పవర్ ని పెంచడానికి కొన్ని పజిల్స్, సుడోకు వంటివి ఇవ్వవ‌చ్చు. ఇలా తల్లిదండ్రుల‌ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటే కచ్చితంగా పిల్లలు యొక్క బ్రెయిన్ షార్ప్ గా మారుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది బ్రెయిన్ పవర్ పెరుగుతుంది.

Admin

Recent Posts