హెల్త్ టిప్స్

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

జీవిత కాలం పొడిగించడమెలా? ప్రతిరోజూ కొన్ని ఆరోగ్యపు అలవాట్లు ఆచరిస్తే జీవితకాలం పొడిగించవచ్చు. ఒక కారు, కొన్న 50 ఏళ్ళకు కూడా కొత్తదిగానే వుండాలంటే, ఎప్పటికపుడు దానికి తగిన మెయిన్టెనెన్స్ చేస్తూ వుండాలి. టైర్లు అరిగితే టైర్లు మార్పించాలి. ఆయిల్ అవసరమైతే ఆయిల్ మార్పించాలి. ఈ రకంగా ఎప్పటికపుడు దాని సర్వీసు చేస్తూ వుంటే తయారీ దారు దాని జీవితకాలం పదిహేను సంవత్సరాలని తెలిపినప్పటికి, మీ సర్వీసు కారణంగా అది అధిక సంవత్సరాలు మన్నుతుంది. మరి మీ శరీర విషయంలో కూడా అంతే.

శరీరానికి ప్రతిరోజూ పోషణ అవసరం. తినే ఆహారాలు ఆరోగ్యకరమైనవై వుండాలి. తగిన వ్యాయామాలు చేయాలి. ఆరోగ్యానికి అవసరమైన మంచి గాలి, నీరు, ఆహారం, విసర్జన, విశ్రాంతి, వీటితో పాటు మానవుడిగా పుట్టి ఆలోచనా శక్తి కలిగి వున్నందుకు మంచి ఆలోచనలు కూడా అవసరమే. చెడు ఆలోచనలు వుంటే అవి శరీరంలో విషపదార్ధాలను పుట్టించి శరీరం రోగాలబారిని పడేందుకు తోడ్పడతాయి. కనుక ఆరోగ్యానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం వంటివాటితోపాటు మానవుడికి మంచి ఆలోచనలు కూడా అవసరమే. శరీర కణాలకవసరమైన అవసరాలు ప్రతి రోజూ అందించాలి. ఆ కణాల పట్ల మీరు శ్రధ్ధ వహించకపోతే, అవి చెడిపోయి మీ వయసు ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

here it is how you can increase your life span

ఆ శరీర కణాలన్నింటిని మంచి మార్గంలో ప్రయాణింపజేసే భాధ్యత మీదే. మీరు డ్రైవర్ సీటులో కూర్చున్నారు. మీరు నడిపే శరీర వాహనం స్లో చేయాలన్నా, వేగిరం చేయాలన్నా మీ చేతులలోనే వుంది. అనారోగ్య చర్యలతోను, పోషకాహార లేమి వంటివాటితోను కొద్ది రోజులలోనే శరీరాన్ని శుష్కింపజేసి జీవిత కాలాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకర ఆహారాలు, అలవాట్లతో శరీరాన్ని బలంగా వుంచి మీ జీవితకాలం పొడిగించుకోవచ్చు. ఏది చేసినా మీ వద్ద వున్న 24 గంటలలోనే చేయగలరు.

Admin

Recent Posts