హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

ప్రస్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్లలో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీనివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందట. ఎక్కువగా తింటే రాత్రిపూట మేలుకోవడం, తిన్న కాసేపటికి కడుపు ఉబ్బడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ఫుడ్ తినడం వల్ల గుండె నొప్పులు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ రోగాల బారిన పడకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

చాలామంది బయట బండిపై దొరికే పునుగులు, బోండాలు, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ తింటుంటారు. అయితే వీటిని తిన‌డం ఆపేస్తే సగం జబ్బులు రావని వైద్యులు అంటున్నారు. అంతేకాదు ఉదయాన్నే రైతులు చద్దన్నం ఉల్లిపాయను నంజుకొని ప్రతిరోజు తింటారు. అలా పట్టణాల్లో ఉండేవారు కూడా చేస్తే 100% కొన్ని జబ్బులు రావు. జంక్ ఫుడ్‌ను తింటే బ్రెయిన్ ఒత్తిడికి గురవడం హార్ట్ ఎటాక్ కారణం అవుతుందట.

if you are eating outside oil food then you will get these diseases

ముఖ్యంగా శరీరంలో అవసరమైన అధిక కొవ్వు నిలువలు, ఉండడం వల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్తప్రసరణ కష్టమై గుండెకు రక్త పంపిణీ కష్టమైపోతుంది. అధికంగా బరువు వల్ల గుండె పనితీరుకు ఆటంకాలు ఏర్పడి గుండెపోటుకు కారణం కావచ్చు. కనుక ఒబేసిటీ ఉన్నవారు ప్రతిరోజు 60 నిమిషాల పాటు కష్టపడి శరీరం అలసిపోయేటట్టు పనిచేయాలి. కనీసం అర‌గంటైనా వ్యాయమం చేయాలి.

Admin

Recent Posts