హెల్త్ టిప్స్

అసిడిటీ స‌మస్య ఉందా.. అయితే కొద్ది రోజులు ఈ ఫుడ్స్‌ను తిన‌కండి..!

చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు ఎక్కువ మంది బాధపడే సమస్యల్లో ఎసిడిటీ కూడా ఒకటి. యాసిడ్ రిప్లక్స్ లేదంటే కడుపు మంట వంటి సమస్యల తో ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణం తీసుకునే ఆహార పదార్థాలు, సరైన జీవన శైలి లేక పోవడం. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం. ఒత్తిడి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం.

ఎక్కువగా స్పైసి ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే యాసిడిటీ ఎక్కువ అవుతుంది. నారింజ, ద్రాక్ష పండ్లు, అవకాడో, టమాటా మొదలైన సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకో వద్దు వీటిని తీసుకోవడం వలన ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఎసిడిటీ సమస్య తో బాధ పడేవాళ్లు ఉల్లి, వెల్లుల్లి, బంగాళదుంపలు, అల్లాన్ని కూడా తీసుకోకూడదు.

if you have acidity problem do not take these foods

గోధుమలు, బ్రౌన్ రైస్, బ్రెడ్, పాస్తా వంటివి కూడా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకోకూడదు. టమాటా చట్నీ పచ్చిమిర్చి చట్నీ వంటివి కూడా తీసుకో వద్దు ఇవి కూడా ఈ సమస్యని పెంచేస్తాయి. వేయించిన మాంసం కూడా అస్సలు తీసుకోకండి. ఎక్కువ స్పైసీ ఫుడ్ ని తీసుకోవద్దు. పచ్చి మిర్చిని బాగా ఎక్కువగా చాలా మంది వంటల్లో వాడతారు ఆ తప్పు కూడా చేయకండి. బటర్, పన్నీర్ వంటివి కూడా తీసుకోకండి.

Admin

Recent Posts