హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారు ఈ ఫుడ్స్‌ను తింటే చాలా ప్ర‌మాదం..!

ఈ మధ్యకాలంలో చాలా మందిలో హైబీపీ వస్తోంది. హైబీపీ ఉన్నవాళ్లు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ సలహా తీసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. టాబ్లెట్లను వాడటంతోపాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే హైబీపీతో బాధపడే వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. హైబీపీ తో బాధపడే వాళ్ళు కాఫీ తీసుకోకపోతే మంచిది. కాఫీ త్వరగా బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది కాబట్టి కాఫీ ని వీలైనంతవరకు దూరం పెడితే మంచిది.

ఉప్పుని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. సాల్ట్ కి బదులుగా సైంధవలవణం వాడితే మంచిది. అదే విధంగా హైబీపీ తో బాధపడే వాళ్ళు పండ్లు మీద సలాడ్స్ మీద సాల్ట్ వేసుకోవడం పూర్తిగా మానేస్తే మంచిది. పంచదార బీపీ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపదు. బాగా బరువు ఉన్న వాళ్ళు పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వచ్చి హై బ్లడ్ ప్రెషర్ సమస్యలను తీసుకువస్తుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తాయి.

if you have high bp do not take these foods

హైబీపీ తో బాధపడే వాళ్ళు బ్రెడ్ కూడా తినకుండా ఉంటే మంచిది. పిండి మరియు బటర్ కలిపి బ్రెడ్ ని తయారు చేస్తారు కనుక బీపీ తో బాధపడే వాళ్ళు దానికి దూరంగా ఉంటే బెస్ట్. ప్రాసెస్డ్ మీట్.. దీనిలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక తీసుకోవద్దు. అదే విధంగా ఎక్కువ ఉప్పు సాస్, చెట్నీ, పచ్చళ్ళు వంటి వాటిలో ఉంటుంది కాబట్టి వాటిని కూడా తగ్గిస్తే మంచిది.

Admin

Recent Posts