హెల్త్ టిప్స్

టెన్ష‌న్‌తో త‌ల‌నొప్పి వ‌స్తుందా.. అయితే ఇలా త‌గ్గించుకోండి..!

నేటి రోజులలో ప్రతి ఒక్కరికి, ఒత్తిడి, ఆందోళన, మానసిక వేదన అనేవి సాధారణమయ్యాయి. జీవితం అంటే పరమ బోర్ అంటారు. నిరాశ పడుతూంటారు. రోజు రోజుకూ మానసిక ఆరోగ్యం దిగజారుతూ వుంటుంది. ఈ రకమైన ఒత్తిడి, ఆందోళనలతో శరీర నొప్పులు, గ్యాస్ సంబంధిత సమస్యలు, అధిక బరువెక్కటం లేదా బరువు బాగా తగ్గిపోవటం వంటివి కూడా ఏర్పడతాయి. కనుక, అన్నిటికంటే ముందుగా వచ్చే టెన్షన్ తలనొప్పిని ఎలా తగ్గించుకుని ప్రశాంతంగా వుండాలో చూడండి.

టెన్షన్ తలనొప్పులను ఒత్తిడి తలనొప్పి అని కూడా అంటారు. సాధారణంగా ఇది నుదుటి భాగం, కణతలు, కళ్ల‌ పై నొప్పులు చూపుతుంది. పురుషులకంటే కూడా మహిళలు దీనికి అధికంగా గురవుతారు. ఈ నొప్పి కొన్ని గంటలనుండి కొన్ని రోజులు, వారాలు కూడా కొనసాగే అవకాశం వుంది. కారణాలు పరిశీలిస్తే, అనేకంగా వుంటాయి. ప్రత్యేకించి ఇది వంశానుగతంగా కూడా చెప్పచ్చు. లేదా మానసిక వేదన కూడా తలనొప్పి కలిగిస్తుంది. ఈ రకమైన నొప్పికి ఆకలి, అలసటలు కూడా కారణం కావచ్చు.

if you have tension headache remove it like this

కలుషిత గాలి కూడా బ్రెయిన్ పై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెంచి అలసట పొందేలా చేస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడి వంటివి సాధారణంగా దీనిని కలిగిస్తాయి. టెన్షన్ తోకూడిన ఈ తలనొప్పిని తగ్గించడమెలా? 1. సహజంగా తగ్గించే ఆహారాలు – చాక్లెట్ లు, కేఫైన్, గ్రీన్ టీ వంటివి కుంగిన మనసును ప్రశాంతపరుస్తాయి. 2. వేడినీటి అభ్యంగన స్నానం శరీరానికి, మైండ్ కు కూడా రిలీఫ్ ఇస్తుంది. 3. ధ్యానం చేయటం, రిలాక్స్ అవటం, వ్యాయామాలు వంటివి కూడా టెన్షన్ తలనొప్పి తగ్గేందుకు తోడ్పడతాయి.

Admin

Recent Posts