బలమైన కండరాలు శరీరం ఫిట్ గాను ఆరోగ్యంగాను వున్నట్లు చెపుతాయి. మరి కండలు తిరిగిన శరీరం త్వరగా కావాలంటే ఏ రకమైన ఆహారాలు తీసుకోవాలనేది పరిశీలించండి. ప్రొటీన్లు అధికంగా వుండే పాల వంటి ద్రవాహారాలే కాక, ఎమినో యాసిడ్లు వుండే ప్రొటీన్ ఆహారాలు శరీరాన్ని పెంచి ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. లీన్ బీన్స్, ఆల్మండ్స్, బచ్చలి, తోటకూరవంటి ఆకు కూరలు, చేప, లీన్ మీట్, పీతలు ఇతర ప్రొటీన్లు వుండే ధాన్యం గింజలు తినాలి. ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వుంటే బలమైన కండలు ఏర్పడతాయి. శరీరం ధృఢంగాను వుంటుంది. రోజువారీ చర్యలలో శరీరంలో ఇవి ఎప్పటికపుడు తగ్గిపోతూ మిమ్మల్ని బలహీనంగాను, సోమరిగాను చేస్తాయి. కనుక వీటిని మరల భర్తీ చేయాలంటే గుడ్లు, మష్రూమ్స్, ఉల్లిపాయలు, మాంసం, టర్కీ లివర్, చిలకడదుంపలు, బచ్చలి, బ్రక్కోలి, కేరట్లు మొదలైన ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారాలు తీసుకోండి.
ఆరోగ్యవంతమైన శరీరంలో బలమైన కండరాలు, ఎముకలు వుంటాయి. శరీర బరువు సమానంగా వుండాలి. ఇది కండరాలు వదులు కాకుండా చేస్తుంది. బెణుకులవంటివి వుండవు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మోనో శాట్యురేటిడ్ కొవ్వులు శరీరాన్ని పటిష్టంగా వుంచి బలమైన కండలు, ఎముకలు ఏర్పరుస్తాయి. దీనికిగాను కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే, గోధుమ బ్రెడ్, పస్తా, తెల్లటి బియ్యం, బార్లీ, కార్న్, ఓట్మీల్, పైన్ ఆపిల్, స్ట్రాబెర్రీలు, ఖర్జూరాలు వంటివి తినాలి.
గ్లూటామైన్ అధికంగా వుండే ఆహారం గట్టి కండలు, ఎముకలు కలిగిస్తుంది. గ్లూటామైన్ లో వుండే ఎమినో యాసిడ్లు శరీరానికి సహజ ఉప ఆహారంగా పనిచేస్తాయి. గ్లూటామైన్ ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. కేబేజి, ఎర్ర బచ్చలి, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలలో ఈ పదార్ధం బాగా వుంటుంది. మీ ఆహారంలో ఈ పదార్ధాలు చేరిస్తే త్వరగా మీ శరీరం కండలను, గట్టి ఎముకలను సంతరించుకుంటుంది. ప్రతిరోజూ తగినంత శరీరానికి అందించాలి. ఇది మీ శరీరంలోని మలినాలను విసర్జించి శరీర అధిక ఉష్ణోగ్రతలనుండి కాపాడుతుంది.