హెల్త్ టిప్స్

లావు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

లావు తగ్గిపోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తినటమేకాదు తినే విధానాలు కూడా పాటించాలి. అవేమిటో పరిశీలించండి. భోజనం మానవద్దు. శరీరానికవసరమయ్యే రీతిలో మూడు సార్లు…లేదంటే తక్కువ ఆహారంతో నాలుగుసార్లు ప్రతిరోజూ తినండి. ఆహారంలో, తగినన్ని సహజ పదార్ధాలు, కూరలు, పండ్లు, ధాన్యాలు, ప్రొటీన్లు వుండేలా చూడండి.

అన్ని ఆహారాలు సమపాళ్ళలో వుండేలా ప్రయత్నించండి. విటమిన్ సి అధికంగా వుండే ఆరెంజస్, నిమ్మ వంటివి ప్రతిరోజూ తినండి. ఎట్టి పరిస్ధితులలోను శరీరానికి అనవసరమైన ఆహారాలను అధికమొత్తంలో అందించకండి. చిన్న డిన్నర్ ప్లేట్, స్పూన్ తో తినడం వంటివి తక్కువగా తినేలా చేస్తాయని నిపుణులు సూచిస్తారు.

if you want to reduce your weight take these foods

వీలైనంతవరకు మీరు తినే ధాన్యాలు పాలిష్ పట్టేసి పోషక విలువలు లేనివిగా కాకుండా ముడి ధాన్యాలుగా వుండేలా ప్రయత్నించండి. ఈ రకమైన ఆహారాలు బ్లడ్ కొల్లెస్టరాల్ స్ధాయి పెరగకుండా, గుండె జబ్బులు రాకుండా, లావుకాకుండా చేస్తాయి. స్నాక్స్ తినాలంటూ చిప్స్, పిజ్జా, బర్గర్ వంటివి తినకండి. బదులుగా కేరట్, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటివి తిని శరీరానికి అవసరమైన పోషకాలు అందివ్వండి.

Admin

Recent Posts