హెల్త్ టిప్స్

మీ జుట్టు రాలుతోందా..టెన్షన్ వద్దు ఈ చిన్న చిట్కాలతో ఒత్తయిన జుట్టు..!!

సాధారణంగా వ‌ర్షా కాలం వచ్చిందంటే కాలుష్యం, దుమ్ము, వ‌ర్షం వల్ల చాలామందికి జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఈ సమస్య ఎక్కువైతే బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా జుట్టు రాలుతోందని బాధపడేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

గోరువెచ్చని నూనెతో మసాజ్.. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ప్రతి రోజు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టుకు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ లాంటి పోషకాలు లభిస్తాయి.

if your hair is falling then follow these tips

కలబంద,పెరుగు మాస్క్.. జుట్టు ఒత్తుగా మృదువుగా తయారు కావడానికి కలబంద పెరుగు మిశ్రమం తో తయారు చేసిన హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ మాస్క్ క్రమం తప్పకుండా వినియోగించడం ద్వారా జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి. కాబట్టి జుట్టు సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ మాస్క్ వినియోగించండి.

ఆవిరి పట్టించడం.. జుట్టు సంరక్షించుకోవడం చాలా మంచిది. దీనికోసం టవల్ ను వేడి నీటిలో నానబెట్టి, తల చుట్టూ చుట్టండి. కాసేపు ఇలాగే వదిలేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి.

Admin

Recent Posts