హెల్త్ టిప్స్

మీ జ్ఞాపక శక్తి తగ్గుతోందా.. కచ్చితంగా ఈ ఫుడ్ తినాల్సిందే..!

వయసు పెరుగుతున్న కొద్ది చాలామందిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఈ సమస్యను చాలా మంది చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు.. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం మద్యం సేవించడం, ధూమపానం, ఒత్తిడి, పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడటం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మీకు కూడా జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వెంటనే చెప్పబోయే స్మూతిని మీ డైట్ లో చేర్చుకోండి.. ఒక అవకాడో తీసుకొని వాటర్ తో బాగా కడగాలి.

దీని తర్వాత సగానికి పైగా కట్ చేసి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి. అలాగే మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల రోల్డ్ వర్డ్స్ వేసి ఒక కప్పు వాటర్ పోసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దీని తర్వాత బ్లెండర్ లో నానబెట్టుకున్న ఓట్స్ ను వేయాలి.

if your memory power is decreasing take this smoothie

అలాగే అవకాడో ఫల్పు , వన్ టేబుల్ స్పూన్ అవకాడో గింజలు, మరో టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, గింజలు తొలగించిన ఖర్జూరాలు నాలుగు, ఒక గ్లాస్ హోం మేడ్ బాదంపాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే స్మూతీ సిద్ధమవుతుంది.. దీన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మెదడులోని కణాలు చురుగ్గా పనిచేసి మీకు జ్ఞాపకశక్తి తగ్గడం సమస్య ఉండదు.

Admin

Recent Posts