శరీరంలోని కొన్ని భాగాలను కొంత సేపు మసాజ్ చేయడం లేదా వాటిపై ఒత్తిడి కలగజేయడం ద్వారా పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చని తెలుసుకోవొచ్చు..దానినే రిఫ్లెక్సాలజీ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే . దీన్నే ఆక్యుప్రెషర్ వైద్యం అని అంటారు.. అయితే ఏ భాగంలో మర్దనా చేస్తే ఏ అనారోగ్యం నుంచి ఉశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని ఒక్కో పార్ట్ ను ప్రెస్ చేయడం వల్ల దాని ప్రభావం మరో అవయవ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇలా ఛాతీ మద్యభాగాన్ని, రెండు కన్నుల మద్య బాగాన్ని ప్రెస్ చేయడం వల్ల మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయట! ఛాతీ ఎముక మధ్య భాగంలో ఉండే పాయింట్‌ను సీ ఆఫ్ ట్రాంక్విలీటీ అని పిలుస్తారు .ఈ పాయింట్‌పై 1 నుంచి 2 నిమిషాల పాటు సున్నితంగా ఒత్తిడిని కలగజేయాలి. అయితే ఆ సమయంలో శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల తొందరపాటు, ఆతృత, ఛాతీ సమస్యలు, హార్ట్ పాల్పిటేషన్స్, ఆస్తమా, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయట. అదేవిధంగా పాలిచ్చే తల్లులకు చక్కగా పాలు వస్తాయట. సరిగ్గా కనుబొమల మధ్యలో ఉండే పాయింట్‌ను థర్డ్ ఐ పాయింట్ అని పిలుస్తారు. ఈ పాయింట్‌ను కొంత సేపు మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. నిద్రలేమితనం, తలనొప్పి, మజ్జుగా ఉండడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను థర్డ్ ఐ పాయింట్ ద్వారా దూరం చేసుకోవచ్చట.
రెండు కళ్లను మూసి కనుబొమల మధ్యలో థర్డ్ ఐ పాయింట్‌ను దాదాపు 1 నిమిషం పాటు చూపుడు వేలు లేదా మధ్య వేలితో సున్నితంగా నొక్కాలి. ఈ సమయంలో దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. అయితే చివరిగా ఒక్క విషయం. రిఫ్లెక్సాలజీ పద్ధతిలో ఆక్యుప్రెషర్ ద్వారా ఉపశమనం పొందాలనుకునే వారు శ్వాసపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కచ్చితమైన శ్వాసతో మానసికంగా కూడా ఉల్లాసం లభిస్తుంది. అరచేతులు, పాదాల్లో ఒత్తిడిని కలగజేస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుందట. దీంతోపాటు పలు నొప్పుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందట. అదేవిధంగా వికారం, వాంతులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయట.