హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో నీరు త‌గ్గ‌కుండా ఉండాలంటే రోజూ వీటిని తీసుకోండి..!

వేసవి కాని, చలికాలం కాని, ప్రతి వ్యక్తికి నీరు ఒక ప్రాధమిక అవసరం. నీరు కలుషితమైనదైతే, ఎన్నో రకాల వ్యాధులు వచ్చి అనారోగ్యం పాలవుతారు. తగినంత నీరు శరీరంలో లేకుంటే శరీరం డీహైడ్రేషన్, అజీర్ణం, కిడ్నీ సంబంధిత సమస్యలకు గురవుతుంది. నీటికి బదులుగా ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు కొన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయాలను పరిశీలించండి. కొబ్బరి బోండాం.. శరీరానికి తగిన నీరు, పోషకాలను ఇచ్చి కాపాడుతుంది. ప్రకృతి అందించిన సహజ పానీయం. రోజులో ఎపుడైనా తాగవచ్చు. దీనిలో పొటాషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్, సల్ఫర్, క్లోరైడ్స్ వంటివి ఎన్నో వుంటాయి.

కొబ్బరి బొండాం నీరు తాగితే గుండెమంట, మలబద్ధకం, మొదలైన వాటిని వెంటనే పోగొడుతుంది. మజ్జిగ.. గ్యాస్ సంబంధిత సమస్యలున్నవారికి మజ్జిగ మంచి పానీయం. పొట్టను శుభ్ర పరచి చల్లని భావన కలిగిస్తుంది. వెన్న తీసేస్తే కొవ్వు తక్కువ. కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్లు మొదలైనవి వుంటాయి. పెరుగును చిలికితే వచ్చేది మజ్జిగ.

take these liquids daily to retain water in your body

ఒక్క గ్లాసెడు నిమ్మరసం తక్షణ శక్తి నిస్తుంది. మంచి రుచి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి శరీరాన్ని ఎప్పటికపుడు తాజాగా వుంచుతుంది.వేడి సూప్ రోజులో ఎపుడు తీసుకున్నా చక్కని ఆరోగ్యాన్నిస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్, అనేక శక్తి నిచ్చే లవణాలు వుంటాయి. కడుపు నింపుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే సుగంధ వస్తువులు దీనిలో వుంటాయి. మంచి రుచి కూడా వుంటుంది. నీరు నిస్సందేహంగా శరీరానికి అత్యవసరమే, ఇతరంగా ఏ పానీయం తాగినప్పటికి అది నీటికి సమానం కాదు. అయినప్పటికి, పరిశుభ్రమైన నీరు లభించనపుడు శరీరావసరాలకు గాను పైన తెలిపిన ప్రత్యామ్నాయ పానీయాలు అవసరం తీర్చటమే కాక ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.

Admin

Recent Posts