హెల్త్ టిప్స్

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నీళ్ల‌ను తాగ‌మ‌ని చెప్ప‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

మన పెద్దలు రోజూ రాత్రి పడుకునే ముందు రాగి చెంబు లేదా గ్లాసులో నీటిని మంచం పక్కనే పెట్టుకుని.. ఉదయం లేవగానే ఆ నీటిని తాగేవారు. ఇప్పటికీ మీరు గమనిస్తే.. పల్లెటూరిలో ఉండే మీ అమ్మమ్మ- నానమ్మలు, తాతయ్యలకు ఇదే అలవాటు ఉంటుంది. రాగిపాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల వారు త్వరగా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. మనం కూడా ఉదయం లేవగానే నీటిని తాగుతున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం తాగే నీరు ఎంతో కొంత కలుషితమై ఉంటుంది. పైగా ప్లాస్టిక్ బాటిల్ లో గంటలతరబడి నిల్వఉంచిన నీటిని పరగడుపున తాగుతాం. అలా తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

మంచినీటిని ముందు ప్లాస్టిక్ బాటిల్ లో పట్టి ఉంచే అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు. వాటికి బదులుగా వీలైనంతవరకూ రాగితో తయారు చేసిన బాటిల్స్ ను వాడాలని లేదంటే స్టీల్ బాటిల్స్ వాడినా ఫర్వాలేదంటున్నారు. ఉదయం లేవగానే పేరుకి తాగామని చెప్పుకునేందుకు ఒక గ్లాసు నీటిని తాగితే సరిపోదంటున్నారు. కనీసం లీటరున్నర నీటిని పరగడుపునే తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పేర్కొంటున్నారు.

this the reason why we need to drink water on empty stomach

ఇలా చేస్తే 25 శాతం వరకూ రోగాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయంటున్నారు. జపాన్ శాస్త్రవేత్తలు లక్ష 50 వేల మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది. వాతావరణం చల్లగా ఉన్నపుడు ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ, టీ లకు బదులుగా గోరువెచ్చని నీటిని తాగాలని వారంతా చెబుతున్నారు. రాగిపాత్రలో నిల్వఉంచిన నీటిని తాగితే..అందులోని మిన‌రల్స్ అందడంతోపాటు బ్యాక్టీరియా, వైరస్ లు కూడా నశిస్తాయి.

అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలినాలు, విషపదార్థాలు మూత్రవిసర్జన ద్వారా బయటకు పోతాయి. అలాగే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి, బరువు తగ్గుతారు. తరచూ అనారోగ్యాల బారిన కూడా పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి లీటరున్నర నీటిని తాగలేనివారు.. 5 నిమిషాల వ్యవధిలో తాగవచ్చని సూచించారు.

Admin

Recent Posts