హెల్త్ టిప్స్

Tamarind Seeds : ఇన్ని రోజులూ వీటిని చెత్త కుండీలో ప‌డేశారు. ఇలా వాడితే షుగ‌ర్ అస‌లు ఉండ‌దు..!

Tamarind Seeds : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కా నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చింతపండు వాడినప్పుడు చింతగింజలను పాడేస్తూ ఉంటాం. ఆ చింత గింజలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. చింత గింజలను వేయించి పొట్టు తీసి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ మోతాదులో కలిపి తీసుకుంటే సరిపోతుంది.

దీన్ని ఉద‌యం లేదా సాయంత్రం ఎప్పుడైనా స‌రే తీసుకోవ‌చ్చు. భోజ‌నానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. అయితే షుగ‌ర్ ఉన్న‌వారు మాత్రం ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పొడి నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

use tamarind seeds in this way to control diabetes

ఈ పొడిలో ఉండే డైటరీ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగు పరుస్తుంది. చింత గింజల పొడితో పళ్లను తోమితే పంటి మీద గార, పసుపు రంగు తొలగి తెల్లగా మెరుస్తాయి. చింత గింజలు పాంక్రియాస్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. చింత గింజల పొడి క‌లిపిన‌ నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నాచురల్ గా మ్యానేజ్ చేయగలుగుతారు. దీంతో షుగ‌ర్ అదుపులో ఉంటుంది. షుగ‌ర్ ఉన్న‌వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

చింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వలన చ‌ర్మానికి వచ్చే ఇన్‌ఫెక్షన్స్ ని తగ్గించుకోవచ్చు. అంతే కాక మూత్రాశ‌య‌ ఇన్ ఫెక్షన్ రాకుండా కూడా చూసుకోవచ్చు. చింత గింజలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత గింజలు, పొడి రెండూ ఆయుర్వేదం షాప్స్ లేదా ఆన్‌లైన్ స్టోర్స్‌ లో లభ్యం అవుతాయి. వీటిని కొనుగోలు చేసి పైన తెలిపిన విధంగా వాడ‌వ‌చ్చు. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Admin

Recent Posts