హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

పురుగులు మాత్రమే తింటే సాధారణంగా ప్రమాదం లేదు. మ‌న కడుపులోని యాసిడ్ ( జీర్ణ ఆమ్లాలు ) వాటిని చంపేస్తుంది. అధికంగా నీళ్లు తాగండి, లక్షణాలు గమనించండి. పండు కుళ్ళింది, పాడైపోయింది తింటే జీర్ణ సమస్యలు రావొచ్చు. వాంతులు వస్తే డాక్టర్‌ దగ్గరకు వెళ్లండి. అసౌకర్యం లేకపోతే సమస్యే లేదు. భవిష్యత్తులో పండ్లను శుభ్రం చేసి, జాగ్రత్తగా చూసి తినడం మంచిది. పొరపాటున పురుగులు ఉన్న మామిడిపండు తినడం చాలా మందికి ఎదురయ్యే విషయమే. దీని వలన ఎటువంటి ఆరోగ్య సమస్య రాదు.

చాలా సందర్భాల్లో మామిడిలో ఉండే పురుగులు ( లార్వా రూపంలో ) మన శరీరానికి హానికరం కాదు. అవి సేంద్రీయంగా ఎదిగిన పండ్లలో సాధారణంగా ఉంటాయి. పురుగు తినడం వల్ల కొంత ప్రోటీన్ అందుతుంది. కొన్ని పురుగులు మానవులకు హానికరం కావు, అవి పండులోనే జీవిస్తూ పెరుగుతాయి.

what happens if you have eaten spoiled mango

ఆ పండు కుళ్ళినదా ? కుళ్ళిన భాగం తిన్నారంటే అందులోని బాక్టీరియా వల్ల వాంతులు, జీర్ణకోశ సమస్యలు రావొచ్చు. కేవలం పురుగు ఉన్నా, కానీ మిగతా పండు పక్కాగా ఉంటే, సాధారణంగా శరీరానికి ఎటువంటి సమస్యలు ఉండవు.

నిజంగా అవసరం లేని ఆందోళన పడక్కర్లేదు. మన తాతల కాలం నుంచి పండ్లు తినడం, వాటిలో పురుగులుండడం సాధారణమే. ప్రతి మనిషి తన జీవిత కాలంలో చూసి చూడక ఏనుగు తలంత మాంసాహారాన్ని పురుగుల రూపంలో తింటాడట. పురుగులు చాలా కూరగాయలలో ఉంటాయి. తిన్న తరువాత మీరు ఆరోగ్యంగా ఉంటే NOTHING TO WORRY . భవిష్యత్తులో పండ్లను శుభ్రం చేసి, కోసి, జాగ్రత్తగా చూసి తినడం మంచిది.

Admin

Recent Posts