హెల్త్ టిప్స్

వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందంటే..?

ప్రకృతి ప్రసాదమైన వెల్లుల్లి(కొన్ని ఏరియాల్లో ఎల్లి పాయలు అని కూడా అంటారు) తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వెల్లుల్లిని తినటం వలన ఎన్నో అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా వెల్లుల్లి పచ్చిగా ఉన్నప్పుడు తినడం వలన చాలా మంచిది. నిద్రలేమి, జుట్టు రాలిపోవడం, లివర్ సమస్యలు, జలుబు వంటి ఎన్నో సమస్యలకి మంచి పరిష్కారం మన వెల్లుల్లి. వెల్లుల్లిలో ఎంతో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. దాదాపుగా ఏడు వేల ఏళ్ల పూర్వం నుండే వెల్లుల్లి ని ఆహారంగా వాడుతున్నామంటే దాని విలువ ఏంటో మనకి అర్థమవుతుంది.

ఇక అసలు విషయానికొస్తే.. వెల్లుల్లి ని కేవలం ఆహారంగానే కాకుండా ఇతర ప్రయోజనాకి కూడా వాడతారంట. ఇవ్వాల్టి కాంపిటీషన్ రోజుల్లో నిద్ర సరిగ్గా పట్టక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు చక్కగా ఒక వెల్లుల్లి పాయని తలదిండు క్రింద పెట్టుకొని పడుకుంటే నిద్ర బాగా పడుతుందట.

what happens if you sleep with garlic under pillow

అలాగే ఎటువంటి నెగటివ్ ఆలోచనలను దగ్గరకు రానియ్యకుండా చూస్తుందంట. వెల్లుల్లి ఉపయోగాలని గమనించి తప్పకుండ ఇప్పటినుంచే వాడకం ప్రారంభించండి… అనారోగ్య సమస్యలనుండి దూరంగా ఉండండి.

Admin

Recent Posts